పద్మ పురస్కారాల్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ఘాటు విమర్శలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ప్రజా గాయకుడు గద్దర్‌కు పద్మ విభూషన్తో పాటు మరికొందరి పేర్లను కూడా రేవంత్‌రెడ్డి సర్కార్ కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం పంపిన ఏ ఒక్కరి పేరును కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు.
పద్మ పురస్కారాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై మోదీ సర్కార్‌కు లేఖ రాస్తానని రేవంత్ అనడాన్ని బండి సంజయ్ తప్పు పట్టారు. గద్దర్‌కు పద్మ అవార్డు ఎట్లిస్తామని ప్రశ్నించారు. నక్సల్స్ భావజాలం ఉన్న గాయకుడు గద్దర్ అని ఆయన అన్నారు. పోలీసులను గద్దర్ హత్య చేశారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల్ని చంపడమే కాకుండా, పాటలు కూడా పాడిన గాయకుడిగా గద్దర్ గురించి సంజయ్ చెప్పుకొచ్చారు.
కేంద్రానికి జాబితా పంపేటప్పుడే జాగ్రత్తలు తీసుకుని వుండాల్సిందని ఆయన అన్నారు. ఎవరికి పద్మ పురస్కారాలు ఇవ్వాలో కేంద్రానికి బాగా తెలుసని బండి సంజయ్ అన్నారు.
గద్దర్ పేరుతో సినీ అవార్డులను రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. గద్దర్ కుమార్తె వెన్నెల గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగి, ఓడిపోయారు. ఇటీవలే ఆమెకు తెలంగాణ సాంస్కృతిక సంస్థ చైర్పర్సన్ పదవి దక్కిన సంగతి తెలిసిందే.
Telangana peru telisinde Gaddar patala valla…
ni peddala juttu em kaadhu
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
అంతేలే ఆడవాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసే వల్లే మాకు ముఖ్యమ్ అంటావ్