తమది జాతీయ పార్టీగా భావించని బీఆర్ఎస్ నేతలు!

గులాబీ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయినప్పటినుంచి ఆ పార్టీ నాయకులకు నిద్ర పట్టడం లేదనే సంగతి తెలిసిందే. ఈనాటికీ వారు నమ్ముతున్నదేమిటంటే… కేసీఆర్ అనవసరంగా పార్టీని జాతీయ పార్టీగా మార్చడంవల్ల, పార్టీ పేరును…

గులాబీ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయినప్పటినుంచి ఆ పార్టీ నాయకులకు నిద్ర పట్టడం లేదనే సంగతి తెలిసిందే. ఈనాటికీ వారు నమ్ముతున్నదేమిటంటే… కేసీఆర్ అనవసరంగా పార్టీని జాతీయ పార్టీగా మార్చడంవల్ల, పార్టీ పేరును మార్చడంవల్ల ఓడిపోయామని అనుకుంటున్నారు. తెలంగాణ సెంటిమెంటును వదిలేసినందువల్ల ప్రజలకు దూరమయ్యామని భావిస్తున్నారు.

కొందరు నాయకులు ఈ విషయం బహిరంగంగానే చెప్పారు. పార్టీ పేరును మళ్ళీ టీఆర్ఎస్ అని మార్చాలని కేసీఆర్ ను డిమాండ్ చేసినా ఆయన ఒప్పుకోలేదు. ఇదే గులాబీ పార్టీ నేతలు ఒకప్పుడు తమ అధినేత జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి గాయిగత్తర లేపుతానని అన్నప్పుడు యమా ఖుషీ అయ్యారు. అధినేత ప్రధాని అయిపోయినట్లు కలలు కన్నారు. దేశ్ కీ నేత కేసీఆర్ అని నినదించారు.

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు. ఎప్పుడైతే ఎన్నికల్లో చావుదెబ్బ తగిలిందో అప్పుడు డ‌ల్‌ పోయారు. అప్పటి నుంచి పార్టీని గతంలో మాదిరిగానే ఉంచాలని అంటున్నారు. కొందరు నాయకులు తాము టీఆర్ఎస్ అనే అంటామని కూడా అన్నారు.

సరిగా చెప్పాలంటే ఇప్పటికీ బీఆర్ఎస్ ను ప్రాంతీయ పార్టీగానే భావిస్తున్నారు. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాల తరువాత మాట్లాడిన కేటీఆర్ కూడా తమది ప్రాంతీయ పార్టీ అనే అనుకుంటున్న భావన కనిపించింది. ఎందుకంటే ….బీజేపీని ఓడించే సత్తా ప్రాంతీయ పార్టీలకే ఉందని అన్నాడు.

ఒక జాతీయ పార్టీ నాయకుడు అలా మాట్లాడడు కదా. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సాధ్యం కాదని అన్నాడు. బీజేపీని ఓడగొట్టే సత్తా ప్రాంతీయ పార్టీలకే ఉందంటే ఆ లిస్టులో గులాబీ పార్టీ కూడా ఉందని చెబుతున్నాడన్న మాట.

4 Replies to “తమది జాతీయ పార్టీగా భావించని బీఆర్ఎస్ నేతలు!”

  1. ఎప్పుడో జాతీయ పార్టీ పెట్టీ దేశం లో చక్రం తిప్పుతా అన్నాడు!

    ఇంతకీ ఈని పార్టీ కి హర్యానా లో ఎన్ని సీట్లు వచ్చినాయి?

Comments are closed.