ఎల్లో మీడియాధిప‌తికి టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌విపై పున‌రాలోచ‌న‌!

ఎల్లో మీడియాధిప‌తికి టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వ‌డంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్టు తెలుస్తోంది. అందుకే స‌ద‌రు మీడియాధిప‌తికి అపాయింట్‌మెంట్ ఇచ్చిన‌ట్టే ఇచ్చి, ఆ త‌ర్వాత ర‌ద్దు చేశార‌ని అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.…

ఎల్లో మీడియాధిప‌తికి టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వ‌డంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్టు తెలుస్తోంది. అందుకే స‌ద‌రు మీడియాధిప‌తికి అపాయింట్‌మెంట్ ఇచ్చిన‌ట్టే ఇచ్చి, ఆ త‌ర్వాత ర‌ద్దు చేశార‌ని అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఏపీ సీఎంవోలో అపాయింట్‌మెంట్స్ చూసే పొలిటిక‌ల్‌, బ్యూరోక్రాట్స్ వ‌ర్గాల‌కు చెందిన ముఖ్య నాయ‌కులు చెప్పిన వివ‌రాల ప్ర‌కారం ఆ మీడియాధిప‌తికి టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చే విష‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నారు.

ఇటీవ‌ల ఒక శ‌నివారం స‌ద‌రు మీడియాధిప‌తిని చంద్ర‌బాబు పిలిపించుకుని చ‌ర్చించారు. ఆ త‌ర్వాత రెండు రోజుల‌కు మ‌ళ్లీ రావాలంటూ చెప్పి పంపారు. దీంతో త‌న‌కు టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ప్ర‌క‌టించ‌డ‌మే త‌రువాయి అని ఆయ‌న అనుకున్నారు. రెండు రోజులకు తిరిగి చంద్ర‌బాబును క‌ల‌వ‌డానికి వెళ్లేందుకు రెడీ అవుతుండ‌గా, సీఎంవో నుంచి చావు క‌బురు చ‌ల్ల‌గా అందింది.

ప్ర‌స్తుతానికి మీతో చంద్ర‌బాబు మాట్లాడే ఆలోచ‌న‌లో లేర‌ని, ఏదైనా స‌మాచారం వుంటే చెబుతామ‌ని సున్నితంగా ఎల్లో చాన‌ల్ అధిప‌తికి చెప్పారు. బాబుతో మీడియాధిప‌తి మాట్లాడి వెళ్లిన త‌ర్వాత ప‌రిణామాలు చ‌క‌చ‌కా మారిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ్య‌క్తులు చెబుతున్నారు. మీడియాధిప‌తిని కొంత మంది అదృశ్య శ‌క్తులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆ మీడియాధిప‌తిని టీటీడీ చైర్మ‌న్‌గా ప్ర‌క‌టించే విష‌యంలో చంద్ర‌బాబు సంశ‌యంలో ప‌డ్డార‌ని స‌మాచారం.

త‌న‌కు టీటీడీ చైర్మ‌న్ ప‌దవి ఇవ్వ‌ర‌నే అనుమానం స‌ద‌రు చాన‌ల్ అధిప‌తిలో క‌లిగింది. దీంతో చంద్ర‌బాబుపై ఆయ‌న గారు గుర్రుమ‌ని ఉన్న‌ట్టు తెలిసింది. ఒక‌వేళ టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి స‌ద‌రు చాన‌ల్ అధిప‌తికి కాకుండా, మ‌రెవ‌రికైనా ఇస్తే, ఆ మ‌రుక్ష‌ణం నుంచే కూట‌మి స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు అనుమానిస్తున్నారు.

9 Replies to “ఎల్లో మీడియాధిప‌తికి టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌విపై పున‌రాలోచ‌న‌!”

  1. అయనకి ఇస్తున్నారు అని నువ్వె పుకార్లు పుట్టిస్తావ్, మళ్ళి పునరాలొచణ అంటూ మడతేసావ్, రెపు ఇవ్వటం లెదు అంటూ మరొ కద చెపుతావ్, ఆ తరువాత పలానా అయనకి ఇందుకె ఇచ్చరు అని మరొ కద చెపుతావ్!

    .

    ఇందులొ ఒక్కట్టి అన్నా నిజం ఉంటుందా? లెక నీ ఊహలె వార్తలు గా రాస్తున్నవా?

  2. రాఘవేంద్రరావు కి ఇవ్వలేదు, మురళి మోహన్ కి ఇవ్వలేదు, వాళ్ళ కంటే స్థాయి ఎక్కువా?

Comments are closed.