హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐపై దుర్భాషలాడారని, ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణలతో నిన్న కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ రోజు నాటకీయ పరిణామాల మధ్య ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఉదయం కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లగా, కౌశిక్ రెడ్డి తన బెడ్రూంలోకి వెళ్లి తలుపు లాక్ చేసుకున్నారు. ఈ సమయంలో మాజీ మంత్రి హరీశ్ రావు అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దీనితో పోలీసులు హరీశ్ రావును కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కౌశిక్ రెడ్డి అరెస్ట్ పై హరీశ్ రావు స్పందిస్తూ, “తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయడం దారుణం. ప్రజాప్రతినిధి ఫిర్యాదును పట్టించుకోకుండా, అతని మీదే ఉల్టా కేసు నమోదు చేయడం ఏమిటి? ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడమే.” అంటూ ఆయన మండిపడ్డారు.
కౌశిక్ రెడ్డి గతంలో కూడా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అప్పుడూ ఆయన అరెస్టైన స్టేషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. ఈసారి ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించారనే కేసులో ఆయనకు జైలుశిక్ష తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పలువురు బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు సైలెంట్‌గా ఉన్న మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచిన కౌశిక్ రెడ్డి అటు అసెంబ్లీలోను, ఇటు బయట హడవుడి చేస్తూ నిత్యం మీడియాకు ఎక్కుతున్నారు.
Call boy jobs available 7997531004