ఎవ‌నిది కుట్ర‌? ఏందా కుట్ర‌?

తెలంగాణ‌లో రాజ‌కీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఫార్మాతో పాటు ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు నిమిత్తం ప్ర‌భుత్వం భూసమీక‌ర‌ణ చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. దీన్ని గ్రామీణ‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ల‌గ‌చ‌ర్ల‌లో…

తెలంగాణ‌లో రాజ‌కీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఫార్మాతో పాటు ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు నిమిత్తం ప్ర‌భుత్వం భూసమీక‌ర‌ణ చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. దీన్ని గ్రామీణ‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ల‌గ‌చ‌ర్ల‌లో క‌లెక్ట‌ర్‌, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌పై ప్ర‌జ‌లు దాడి చేయ‌డాన్ని ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది.

ఇప్ప‌టికే మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ రిపోర్ట్‌లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు కూడా చేర్చారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేయొచ్చ‌నే ప్ర‌చారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ఎక్స్ వేదిక‌గా కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో సీఎం రేవంత్‌రెడ్డిపై విరుచుకుప‌డ్డారు. కేటీఆర్ పెట్టిన పోస్టు ఏంటంటే….

“ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర? నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? నీ అల్లుని కోసమో, అన్న కోసమో… రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? నీ ప్రైవేట్‌‌ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం ఎవరి కుట్ర? పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించింది ఎవరి కుట్ర? ఎవని కోసం కుట్ర!

మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? 50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది? నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు! రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను!

నీ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. చేసుకో అరెస్ట్ రేవంత్‌ రెడ్డి! చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో!” అంటూ కేటీఆర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

త‌న‌ను అరెస్ట్ చేస్తావ‌ని ముందే తెలుసు అని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే రైతుల కోసం అరెస్ట్ కావ‌డం గ‌ర్వంగా ఫీల్ అవుతాన‌ని కేటీఆర్ తెలిపారు. మ‌రి కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారా? లేదా? అనేది చూడాలి.

3 Replies to “ఎవ‌నిది కుట్ర‌? ఏందా కుట్ర‌?”

  1. ఏందీరా డ్రామాలు చేస్తున్నావురా ఒరేయ్ ముక్కోడి కుట్రలు పోయినాయి అనుకుంటే ఈ కేటీఆర్ గాడు ఎగిరెగిరి పడుతాండు , కుతంత్రాల కేటీఆర్ గానికి వాని కుటుంబానికి ఉద్యాగాలు పోయేసరికి ఈ గత్తర లేపి… వాడి చేసిన కార్ రేసింగ్ కుంభకోణం , ఫోన్ టాపింగ్ తో హీరోయిన్స్ కి డ్రగ్స్ అలవాటు చేసుడు, రేవ్ పార్టీ లతో దావత్ చేసుడు , ధరణి భూములు కాజేసుడు పక్కదోవ పట్టించటానికి నాటకాలు , ఇవన్నీ ముక్కోడి కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య

Comments are closed.