తీన్మార్​ మల్లన్న చెప్పిందే.. మహేష్​ గౌడ్​ చెప్పాడు

రేవంత్​ రెడ్డి మరో నాలుగేళ్లు మాత్రమే సీఎంగా ఉంటాడని, ఆ తరువాత బీసీ నాయకుడు సీఎం అవుతాడని అన్నాడు.

కాంగ్రెస్​ ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న చాలా కాలంగా చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డేనని, ఆ తరువాత బీసీ నేత సీఎం అవుతాడని అన్నాడు. తాజాగా ఇదే మాట టీపీసీసీ అధ్యక్షుడు మహేష్​ కుమార్​ గౌడ్​ చెప్పాడు. రేవంత్​ రెడ్డి మరో నాలుగేళ్లు మాత్రమే సీఎంగా ఉంటాడని, ఆ తరువాత బీసీ నాయకుడు సీఎం అవుతాడని అన్నాడు.

గతంలో కొందరు మంత్రులు, కాంగ్రెసు నాయకులు రేవంత్​ రెడ్డి పదేళ్లు సీఎంగా ఉంటాడని అన్నారు. కాని కులగణన నేపథ్యంలో కొందరు కాంగ్రెసు నాయకులు బీసీ సీఎం మంత్రం జపిస్తున్నారు. ఈ మధ్య రేవంత్​ రెడ్డి కూడా నేనే చివరి రెడ్డి ముఖ్యమంత్రినైనా ఏం బాధపడను అని చెప్పాడు. తాజాగా ఈ విషయాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించాడు. ఈ 5 సంవత్సరాలు సీఎంగా రేవంత్ రెడ్డే ఉంటారని స్పష్టం చేశాడు. వచ్చే రోజుల్లో రాజకీయాలు అన్నీ బీసీ అజెండాగా జరుగుతాయన్నాడు. బీసీ సీఎం కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యం అవుతుందన్నాడు. భవిష్యత్తులో తెలంగాణలో బీసీ వ్యక్తి సీఎం అవుతారన్నాడు.

తెలంగాణలో కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు రిజర్వేషన్లపై గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ జరుగుతోంది. రేవంత్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చిన రోజుల వ్యవధిలోనే మహేశ్ కుమార్ గౌడ్ కూడా అదే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాష్ట్రంలో ఇటీవల జరిగిన కుల గణన నేపథ్యంలో రేవంత్ ఆ తరహా వ్యాఖ్యలు చేయగా… ఇప్పుడు మహేశ్ కూడా అదే తరహాలో స్పందించడం గమనార్హం. తాజాగా మహేశ్ కుమార్ గౌడ్ బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలన్నది రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయమని ఆయన చెప్పుకొచ్చాడు.

మహేశ్​ కుమార్​ గౌడ్​ చెప్పదాన్నిబట్టి అర్థమయ్యేదేమిటంటే…మరో నాలుగేళ్ల తరువాత కాంగ్రెసు అధికారంలోకి వస్తే బీసీ నాయకుడు సీఎం అవుతాడు. కాని వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ అధికారంలోకి వస్తే మాత్రం కేసీఆర్​ సీఎం అవుతాడు. మళ్లీ కేసీఆరే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్​ఎస్​ నాయకులు ఎప్పటి నుంచో అంటున్నారు. కాంగ్రెసు అధికారంలోకి బీసీ సీఎం కావొచ్చేమోగాని బీఆర్​ఎస్​ అధికారంలోకి వస్తే మాత్రం బీసీ సీఎం అయ్యే అవకాశం ఉండదు.

7 Replies to “తీన్మార్​ మల్లన్న చెప్పిందే.. మహేష్​ గౌడ్​ చెప్పాడు”

  1. Ayithe Congress PM candidate kooda BC ni cheyyali kada? adi matram cheyyaru, vaadu pothe veedu veedu pothe inkodu… andaru aa G family kinde vundaali… emira hypocrisy?

Comments are closed.