ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు హై కోర్టులో స్వల్ప ఊరట దక్కింది. న్యాయస్థానం 10 రోజులు పాటు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. కేసు సంబంధిత విచారణను కొనసాగించాల్సిందిగా హై కోర్టు పేర్కొంది.
ఇదే కాకుండా, ఈ నెల 30లోపు ప్రభుత్వానికి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. కాగా, మూడు రోజులుగా కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున వస్తున్న వార్తల నేపధ్యంలో ఇవాళ కూడా అసెంబ్లీలో ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి చర్చించాలనీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఒక సందర్భంలో స్పీకర్ పొడియాన్ని చుట్టుముట్టడంతో కాసేపు తీవ్ర గందరగోళం ఏర్పడింది.
బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత, అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… “ఎక్కడైనా చర్చకు సిద్ధమేనని, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఫార్ములా ఈ కార్ కంపెనీ ప్రతినిధులు కలిశారని, కేటీఆర్‌తో చీకటి ఒప్పందం ఉందని అప్పుడే తనకు చెప్పినట్లు” సభలో తెలిపారు. “మొత్తం స్కాం రూ. 600 కోట్లది, అయితే ప్రభుత్వం మారడంతో అది రూ. 55 కోట్ల దగ్గర ఆగిపోయింది” అని పేర్కొన్నారు.
మొత్తానికి, 10 రోజుల పాటు కేటీఆర్ అరెస్ట్ నుంచి ఊరట దక్కడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, కార్ రేసు వల్ల కోట్ల రూపాయిలు తెలంగాణకు లాభం వచ్చిందని కోర్టులో కేటీఆర్ తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ కేసు నుంచి కేటీఆర్ ఈజీగా బయటపడతారని బీఆర్ఎస్ శ్రేణులు నమ్ముతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అవినీతి ఆరోపణలు చేసినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది గడిచినా, బీఆర్ఎస్‌లోని ఒక పెద్ద నాయకుడిని కూడా అవినీతి కేసులో అరెస్ట్ చేయకపోవడం గమనార్హం.
ఏంది భాయ్ ktr !50 కోట్ల కోసమా ఇదంతా..మా అన్నీయ్య చూడు 1750…గట్లుండాలే దెబ్బ మరి!!
Maabolligaaduunlimitedandstillunstoppable
అరెస్ట్ అయితే మాత్రం ఏమైందిలే. లీడర్స్ అరెస్ట్ అయితే కొన్నాళ్ళు జై ల్ లో ఉండి తిరిగి వచ్చేస్తారు. మళ్ళీ బిజినెస్ as usual.