మళ్లీ మొదటికొచ్చిన నాగార్జున

నాగార్జున ఓ వెబ్ సిరీస్ లో నటిస్తారనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. కొత్త ఏడాదిలో ఆ దిశగా నాగ్ ప్రయత్నిస్తారేమో చూడాలి.

ఓ ప్రాజెక్టు పూర్తయిన ప్రతిసారి నాగార్జున కెరీర్ పై క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. ఇప్పుడు కూడా మరోసారి “నెక్ట్స్ ఏంటి” అనే పరిస్థితి వచ్చింది. మొన్నటివరకు ఆయన చేతిలో పలు ప్రాజెక్టులున్నాయి.

ఓవైపు బిగ్ బాస్ పనులు చూసుకుంటేనే, మరోవైపు కూలీ సినిమాలో నటించారు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ముగిసింది. కూలి సినిమాకు సంబంధించి షూటింగ్ నడుస్తోంది. ప్రస్తుతం నాగ్ అదే మేకోవర్ లో ఉన్నారు. కుబేర సినిమా పనులు కొలిక్కి వచ్చాయి.

కుబేర, కూలి రెండింటిలో నాగ్ హీరో కాదు. ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేరలో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇక రజనీకాంత్ హీరోగా వస్తున్న కూలి సినిమాలో నాగ్ విలన్. హీరోగా ఆయన కొత్త సినిమాలేవీ ప్రకటించలేదు.

వాట్ నెక్ట్స్.. తదుపరి నాగార్జున ఏం చేయబోతున్నారు. బంగార్రాజు రిలీజ్ తర్వాత, నా సామిరంగ తర్వాత ఇదే ప్రశ్న తలెత్తింది. ఇప్పుడు మరోసారి ఇదే ప్రశ్న రిపీట్ అవుతోంది. దీనికి కారణం ఆయన ఓ సినిమా రిలీజైన వెంటనే మరో సినిమా స్టార్ట్ చేయకపోవడమే.

నాగార్జున ఓ వెబ్ సిరీస్ లో నటిస్తారనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. కొత్త ఏడాదిలో ఆ దిశగా నాగ్ ప్రయత్నిస్తారేమో చూడాలి.

3 Replies to “మళ్లీ మొదటికొచ్చిన నాగార్జున”

  1. నాగర్జునకి నేను డైరక్ట్ చేస్తాను యిప్పటికీ నాగార్జునని జనాలు ఎల చేస్తే చూస్తారో నాకు తెలుసు నాగార్జున attar flop సినిమా కి ఎంత వసూలు vatchayo ఆ ఖర్చు తో మూవీ teeddam నాగార్జునకి పంపండి

Comments are closed.