పాన్ ఇండియా సీఎం!

చిత్ర ప‌రిశ్ర‌మ‌పై కాంగ్రెస్ స‌ర్కార్ ఆధిప‌త్యం చెలాయించాల‌నే ప్ర‌య‌త్నాల్ని కొన‌సాగిస్తూనే వుంది.

చిత్ర ప‌రిశ్ర‌మ‌పై కాంగ్రెస్ స‌ర్కార్ ఆధిప‌త్యం చెలాయించాల‌నే ప్ర‌య‌త్నాల్ని కొన‌సాగిస్తూనే వుంది. ఇటివ‌ల టాలీవుడ్ ప్ర‌ముఖులు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల‌తో స‌మావేశ‌మై ప‌లు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు. ఈ భేటీలో అల్లు అర్జున్‌, రామ్‌చ‌ర‌ణ్‌పై సానుకూల కామెంట్స్ చేశారు. అలాగే హైద‌రాబాద్‌ను ప్ర‌పంచ చిత్ర‌ప‌రిశ్ర‌మ స్థాయికి అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

అయితే అల్లు అర్జున్‌ను పాన్ ఇండియా హీరోగా పిలుస్తున్న నేప‌థ్యంలో, కాంగ్రెస్ ప్ర‌జాప్ర‌తినిధులు త‌మ ముఖ్య‌మంత్రిగా ఆ రేంజ్ సీఎంగా అభివ‌ర్ణించ‌డం విశేషం. గాంధీభ‌వ‌న్‌లో కాంగ్రెస్ ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి మీడియా ప్ర‌తినిధుల‌తో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ పాన్ ఇండియా స్టార్‌ను అరెస్ట్ చేయ‌డంతో సీఎం రేవంత్‌రెడ్డి పాన్ ఇండియా స్టార్ అయ్యార‌న్నారు. దేశంలో కొంద‌రు ముఖ్య‌మంత్రులు అవినీతికి పాల్ప‌డి గుర్తింపు పొందార‌న్నారు.

కానీ రేవంత్‌రెడ్డి మాత్రం సాహ‌సోపేత నిర్ణ‌యాల‌తో దేశంలో అంద‌రికీ తెలిసొచ్చార‌న్నారు. రీజిన‌ల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) అలైన్‌మెంట్ మార్చి, రైతుల్ని మోస‌గించాల‌ని బీఆర్ఎస్ ప్లానింగ్ చేయాల‌ని చూసింద‌ని చామ‌ల కిర‌ణ్ ఆరోపించారు. కానీ త‌మకు దోచుకోవాల‌నే ఉద్దేశం లేద‌న్నారు. కేటీఆర్ త‌ప్పు చేస్తే త‌ప్ప‌క జైలుకు వెళ్తార‌ని ఆయ‌న అన్నారు.

కాంగ్రెస్ నేత‌ల మాట‌ల తీరు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ను రెచ్చ‌గొట్టేలా ఉన్నాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అల్లు అర్జున్ సినిమా బినిఫిట్ షోలో దుర్ఘ‌ట‌న త‌ర్వాత చిత్ర ప‌రిశ్ర‌మ‌, కాంగ్రెస్ స‌ర్కార్ మ‌ధ్య వివాదం చెల‌రేగింది. సీఎంతో భేటీ త‌ర్వాత స‌ర్దుబాటు అయ్యింద‌నుకుంటున్న త‌రుణంలో మ‌ళ్లీ హాట్ కామెంట్స్‌ చేయ‌డం దేనికి సంకేతం?

One Reply to “పాన్ ఇండియా సీఎం!”

  1. నెత్తి మీద ఓటుకు నోటు కేసు…గురువుగా సీబీన్ తన పలుకుబడిని ఉపయోగిస్తూ అన్నివిధాల కేసులన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు సాక్షి లో వార్తలు…

Comments are closed.