గేమ్ పాతదే.. రూల్స్ ఛేంజ్

భారీ కథ, కుటుంబాల లింక్స్, భారీ పాటలు, భారీ చిత్రీకరణ, మధ్యలో చిన్న ఫన్ ట్రాక్ ఇలా అన్నీ సమపాళ్లలో కలిపి వదిలేవారు.

చిన్ని కృష్ణ, ఆకుల శివ, భూపతి రాజా, పరుచూరి బ్రదర్స్ ఇలాంటి భారీ సినిమాల కథకులు వుండేవారు మనకు. చాలా భారీ కథలు అల్లేవారు. ఆ కథలు అన్నీ కూడా ఓ ఫార్ములా చట్రం మేరకు మాత్రమే వుండేవి.

భారీ కథ, కుటుంబాల లింక్స్, భారీ పాటలు, భారీ చిత్రీకరణ, మధ్యలో చిన్న ఫన్ ట్రాక్ ఇలా అన్నీ సమపాళ్లలో కలిపి వదిలేవారు. జనం కూడా ఈ లింక్ లు, ఈ ట్విస్ట్ లు, ఫ్లాష్ బ్యాక్ లు కలగలిసిన భారీ సినిమాలను హిట్ చేసేవారు.

ఈ రోజు విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమా ట్రయిలర్ అలాగే వుంది. కొత్త గేమ్ కాదు, దర్శకుడు శంకర్ కూడా స్టేజ్ మీద అదే చెప్పారు. నిజాయతీ గల అధికారి, రాజకీయ నాయకుడికి మధ్య పోరు అని. ట్రయిలర్ లో అది మాత్రమే కాదు. ఇంకా చాలా వుంది.

తల్లి సెంటిమెంట్ కనిపించింది, తండ్రి ఎపిసోడ్ కనిపించింది, హీరో ఎలివేషన్ కనిపించింది. ఒక పది లుక్స్ లో హీరో చరణ్ కనిపించారు. భారీ పాటలు, బ్లాస్టింగ్, యాక్షన్ ఎపిసోడ్ లు వున్నాయి. ఈ భారీ నుంచి అతి భారీ అంతా ఆ ఓల్డ్ గేమ్ లోనే ఇమిడ్చారు.

అందువల్ల కంటెంట్ ఎలా వుంటుంది, సినిమాలో ఏ ఆర్డర్‌లో నడుస్తుంది, ఈ భారీ తనం, కొత్త రూల్స్ ఆ ఓల్డ్ గేమ్‌ను ఏ మేరకు మరిపిస్తాయి అన్నదాన్ని బట్టి సినిమా హిట్‌నా కాదా అన్నది వుంటుంది. ప్రస్తుతానికి అయితే ఓ భారీ సినిమా ట్రైలర్ బయటకు వచ్చినట్లు వుంది. కెమేరా వర్క్ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండింగ్ సినిమా భారీ తనానికి తగినట్లే వుంది.

20 Replies to “గేమ్ పాతదే.. రూల్స్ ఛేంజ్”

  1. సినిమా ఎలా ఉన్నా టికెట్లు స్క్రీన్ ల లెక్కలు కదా..వాసీసీబీస్తాయిల్ సొమ్ములు..

  2. Rey shankar emi teesav ra nuvvu. Trailer looks like a mix of bharateeyudu, oke okkadu and sivaji. Lafut naa k ga. Movie atu itu aithe ninnu janasena fans kummestham.

  3. ట్రైలర్ ఎలాగుంది అంటే:

    ఒకే ఒక్కడు + జెంటిల్మన్ + భారతీయుడు + శివాజీ = గేమ్ చేంజర్

    ఎందుకో కానీ రోబో ఒక్కటే మిస్సయినట్టు అనిపించింది

  4. Template is old and story too, it will run only if there are twists and surprises in the script.

    someone said Anjali role will be different. Let’s wait and see.

    All the best to Game Changer team!!

Comments are closed.