రాజమౌళి-మహేష్.. మీరు మారిపోయారు సార్

ఇంతమంది చెప్పేసిన తర్వాత ఒక్క ముక్క చెప్పడానికి రాజమౌళికి వచ్చిన ఇబ్బందేంటి?

ఎందుకంత రహస్యం.. ఏముంది అందులో.. లక్షలాది మంది ఎదురుచూస్తున్న సందర్భం.. ఒక్క ముక్క చెబితే సరిపోతుంది కదా.. ఫస్ట్ లుక్ అడగలేదు కదా.. ఓ స్టిల్ మాత్రమే.. ఆమాత్రం దానికి కూడా అంత బెట్టు ఎందుకు? హైప్ కోసం ఇదంతా చేస్తున్నారనుకుందాం.. ఇప్పటికే బోలెడంత హైప్ ఉంది కదా..

రాజమౌళి సినిమాలకు ప్రచారం అక్కర్లేదు, మహేష్ బాబు సినిమాలకు అంతకంటే అక్కర్లేదు. అభిమానులే ఆ సినిమాను మోస్తారు. బాహుబలి-2కు ప్రచారానికి అస్సలు ఖర్చుపెట్టలేదని రాజమౌళే చెప్పుకున్నాడు. మహేష్ బాబు సినిమాకు కూడా ఆ ఖర్చు అక్కర్లేదు. ఎటొచ్చి ప్రేక్షకులు కోరుకుంటోంది ఓ చిన్న క్లారిటీ, మరో చిన్న అప్ డేట్.. అంతేకదా.. ఇచ్చేయొచ్చు కదా.. దానికెందుకు అంత సస్పెన్స్. ఇందులో ఎందుకు అంత రహస్యం.

మహేష్ బాబు, రాజమౌళి సినిమా పూజ ఈరోజు జరిగిందనేది అందరికీ తెలుసు. అదేదో ఉత్తుత్తి ప్రచారం అనుకోడానికి లేదు. నిండు సభలో స్వయంగా దిల్ రాజు చెప్పేశారు. తన సినిమా ఓపెనింగ్ పెట్టుకొని, గేమ్ ఛేంజర్ ట్రయిలర్ లాంచ్ కు వచ్చాడని. అలాగే రాజమౌళి-మహేష్ కు ఆల్ ది బెస్ట్ చెప్పేశాడు తమన్.

అదే వేదికపై రామ్ చరణ్ కూడా స్పందించాడు. ఏడాదిన్నరలో మహేష్-జక్కన్న సినిమా వచ్చేస్తుందన్నాడు. ఇక యాంకర్ సుమ కూడా ‘లాంఛింగ్ అయింది, ఫొటోలు చూపించండి’ అంటూ రాజమౌళిని టీజ్ చేశారు.

ఇంతమంది చెప్పేసిన తర్వాత ఒక్క ముక్క చెప్పడానికి రాజమౌళికి వచ్చిన ఇబ్బందేంటి? అది గేమ్ ఛేంజర్ ఫంక్షనే కావొచ్చు, వాళ్లే స్వయంగా మాట్లాడుతున్నప్పుడు ఈయనకు వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? మహేష్ బాబు వద్దన్నాడా? కీరవాణి ముహూర్తం బాగాలేదన్నారా? తండ్రి విజయేంద్రప్రసాద్ ఏమైనా సెంటిమెంట్ అడ్డుపుల్ల వేశారా?

నిండు సభలో ఇంతమంది ప్రస్తావించినప్పటికీ.. కింద నుంచి జనం అరుస్తున్నప్పటికీ జక్కన్న చలించలేదు. ‘మనం బయట మాట్లాడుకుందాం’ అని సుమతో అన్నాడు కానీ, ‘అవును’ అని ఒక్క ముక్క మాట్లాడలేదు.

నిజానికి రాజమౌళి విషయంలో గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. తను చేసిన ప్రతి ప్రాజెక్టుపై ముందే అప్ డేట్ ఇచ్చేవాడు. మీడియాతో అతడి టీమ్ రెగ్యులర్ గా టచ్ లో ఉండేది. మహేష్ బాబు సినిమా విషయంలో మాత్రం రాజమౌళి మారిపోయాడు.

రాజమౌళి మాత్రమే కాదు, మహేష్ కూడా మారిపోయాడు. దశాబ్దానికి పైగా తన సినిమాల ఓపెనింగ్స్ కు దూరంగా ఉండే మహేష్, ఈరోజు పూజా కార్యక్రమానికి హాజరయ్యాడంట. ఈ సంగతి పక్కనపెడితే.. ఈ సినిమా విషయాల్ని రాజమౌళి ఎందుకింత రహస్యంగా ఉంచుతున్నాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

3 Replies to “రాజమౌళి-మహేష్.. మీరు మారిపోయారు సార్”

  1. రాజమౌళి కూడా మహేష్ సినిమాలు లైట్ తీసుకుంటున్నట్టున్నాడు. పాపం మహేష్!!

Comments are closed.