దావోస్ వెళ్ళని కేసీఆర్.. రేవంత్ అందుకు భిన్నం !

ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే ఇతర దేశాల నుంచి పెట్టుబడుల కోసం రేవంత్ రెడ్డి వెళ్తే దానిని అభినందించాల్సిన వారు ట్రోల్స్ చేయటం గమనార్హం.

కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉన్నా దావోస్ ప్రపంచ ఆర్ధిక సదస్సు గురించి ఏనాడూ పట్టించుకోలేదు. కుమారుడు కేటీఆర్ వెళ్ళేవాడు. ఆయన సీఎంగా ఉన్నంత కాలం విదేశాలకు వెళ్ళింది చాలా తక్కువ. కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్లు విదేశాలకు పెద్దగా వెళ్ళలేదు.

ఒకసారి చైనాకు, మరోసారి ఇంకో దేశానికో వెళ్ళాడు. అంతే. కానీ రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా ఉన్నాడు. ఆయన సీఎం అయినప్పటి నుంచి విదేశాలకు వెళుతూనే ఉన్నాడు. దావోస్ కు గత ఏడాది వెళ్ళాడు. ఈ ఏడాది కూడా వెళుతున్నాడు. గత ఏడాది అయిదు దేశాల్లో రేవంత్ రెడ్డి పర్యటించాడు.

దావోస్ లో ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొన్న తరువాత లండన్ వెళ్ళాడు. మరోసారి అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించాడు. తొమ్మిది నెలల్లోనే అయిదు దేశాల్లో పర్యటించిన రేవంత్ ఇప్పుడు మూడోసారి విదేశాలకు వెళుతున్నాడు. పది రోజులు విదేశాల్లో పర్యటిస్తాడు.

ముందుగా ఈ నెల 14 న ఆస్ట్రేలియా వెళతాడు. అక్కడ నాలుగు రోజులు పర్యటించిన తరువాత సింగపూర్ వెళ్లి అక్కడ రెండు రోజులు పర్యటిస్తాడు. ఆ తరువాత దావోస్ వెళ్లి ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొంటాడు. రిపబ్లిక్ డే ముందు రాష్ట్రానికి తిరిగొస్తాడు. ముఖ్యమంత్రి అయిన నాలుగు నెలలకే ఇతర దేశాల పెట్టుబడుల కోసం దావోస్ వెళ్ళాడు.

అప్పట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై జోకులు పేలాయి. ఆయన ఓ ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో గుంపు మేస్త్రి ని అని చెప్పుకున్నాడు. దానిని ప్రతిపక్షాలు విపరీతంగా ట్రోల్ చేశాయి. దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ మాట్లాడిన వీడియోలను ట్రోల్ చేశారు. ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే ఇతర దేశాల నుంచి పెట్టుబడుల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తే దానిని అభినందించాల్సిన వారు ట్రోల్స్ చేయటం గమనార్హం.

6 Replies to “దావోస్ వెళ్ళని కేసీఆర్.. రేవంత్ అందుకు భిన్నం !”

Comments are closed.