Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బత్తాయి కాయల బాబ్జీ...పృథ్వీ

బత్తాయి కాయల బాబ్జీ...పృథ్వీ

థర్టీ ఇయర్స్ పృథ్వీ..ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ కమేడియన్ అనడంలో డౌట్ అక్కర్లేదు. బ్రహ్మానందం సైడ్ అయిపోయారు. మిగిలిన వారి సంగతి అలా ఉంచితే, ఇప్పుడు రైటర్లకు హాట్ చాయిస్ గా మారాడు పృథ్వీ. గతంలో బ్రహ్మీ కోసం కాన్సెప్ట్ లు, క్యారెక్టర్లు తయారుచేసినట్లే, ఇఫ్పడు పృథ్వీ కోసం తయారుచేస్తున్నారు. 

త్వరలో విడుదల కాబోయే బాబు బంగారం సినిమాలో పృథ్వీ ‘బత్తాయి కాయల బాబ్జీ’ గా కనిపిస్తారట. ఒక సినిమాలో పృథ్వీకి “అమ్మ నా బత్తాయో’’ అనడం ఊతపదం. కానీ దాన్ని ఈ సినిమాలో వాడలేదట. మంచి, చెడు, సంతోషం, దుఖం అన్నింటికీ బత్తాయి ప్రమేయం లేకుండా మాట్లాడదట ఈ క్యారెక్టర్. రష్ చూసిన జనాలు ఈ సినిమాతో పృథ్వీ మరో మెట్టు పైకి ఎక్కుతాడంటున్నారు. 

సినిమా తొలిసగం అంతా పృథ్వీ తన కామెడీతో కదం తొక్కేస్తాడట. మళ్లీ క్లైమాక్స్ లో దర్శనమిస్తాడట. రాబోయే ‘సెల్ఫీ రాజా’లో కూడా పృథ్వీ మంచి క్యారెక్టరే చేశాడు..బన్నీ మాదిరిగా ‘చెప్పను బ్రదర్..’ అంటూ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?