Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

బండారు దౌత్యం విఫలమైందా?

బండారు దౌత్యం విఫలమైందా?

మోడీ మేనేజ్ మెంట్ టీమ్ మరోసారి తన ప్రయత్నాలు ప్రారంభించింది. జాతీయ అంతర్జాతీయంగా, నోట్ల రద్దు కారణంగా మసగబారుతున్న మోడీ ప్రతిష్టకు మళ్లీ మెరుగులు పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే మోడీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించే పాపులర్ జనాలతో ప్రకటనలు చేయించే పనిలో పడింది ఆయన మేనేజ్ మెంట్ టీమ్. 

అందులో భాగంగానే తెలుగునాట కాస్త అభిమాన గణం బలంగా వున్న మెగా ఫ్యామిలీ మీద కూడా మోడీ టీమ్ దృష్టి పెట్టినట్లు తెలిసింది. అందులో భాగంగానే నిన్నటికి నిన్న రెండు ప్రయత్నాలు చేస్తే, ఒకటి సక్సెస్ అయింది. మరొకటి వికటించింది. మంత్రి దత్తాత్రేయ తన స్వకారంతో పాటు స్వామికార్యం చక్కబెట్టాలని చూసినట్లు తెలుస్తోంది. నోట్ల రద్దుపై పవన్ అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రయత్నించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

పవన్ ను వీలయితే తన మనసులో మాట మీడియాతో షేర్ చేసుకోమని కూడా కోరినట్లు, దానికి పవన్ నవ్వేసి ఊరుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా వుంటే తన సోదరుడు నాగబాబు విడియో మెసేజ్ మోడీ వ్యవహారానికి అనుకూలంగా వెళ్తోందని తెలిసి, వెంటనే పవన్ కూడా ట్వీట్ చేసేసారని తెలుస్తోంది. 

కొసమెరుపు ఏమిటంటే, ఆరెంజ్ దెబ్బతో నల్లడబ్బే కాదు, తెల్లడబ్బు కూడా వాష్ అవుట్ అయిపోయిన నాగబాబు ఇలా మాట్లాడడం, నాలుగైదు సినిమాలకు భారీ అడ్వాన్స్ లు అందేసుకున్న పవన్ అలా మాట్లాడడం సహజమే కదా అని కామెంట్ లు వినిపిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?