Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఒకటే పాయింట్.. వేవ్ వుందా లేదా?

ఒకటే పాయింట్.. వేవ్ వుందా లేదా?

ఇన్ని కబుర్లు వద్దు పాయింట్‌కు రా అనే మీమ్ ఒకటి వుంది. ప్రస్తుతం ఆంధ్రలో ఎన్నికల వ్యవహారం మీద అలాంటి ప్రశ్నే వినిపిస్తోంది. వేవ్ వుందా లేదా? ఉంటే అది కూటమి వైపా, వైకాపా వైపా? అంతే తప్ప ఎడ్జ్ లో వుంది.. పోటా పోటీగా వుంది. పది సీట్లు అటు ఇటుగా వీళ్లు వస్తారు. వాళ్లు పోతారు లాంటి మాటలు వద్దు అంటున్నారు ఎన్నికల మీద ఆసక్తి వున్న జనాలు.

ఎందుకంటే ఆంధ్రలో ఎన్నికల అనుభవం పండిన వారు చెప్పే మాట ఒకటే. ఇక్కడ వస్తే వేవ్ వస్తుంది తప్ప ఎడ్జ్ లో వుండడం, పోవడం వుండదు. వస్తే 120 లేదంటే 30 లోపు అది తెలుగుదేశం అయినా వైకాపా అయినా అంటున్నారు.

వేవ్ వుంది అని కనిపిస్తుంది ఒక్కోసారి. కనపడదు ఒక్కోసారి. ఇప్పుడు అలాగే జనాలు గుంభనంగా వున్నారు. ఒకప్పుడు యాభై శాతం ఓటర్లు డిసైడ్ అయితే, మిగిలిన యాభై శాతం మంది ఊగిసలాటలో వుండేవారు. వీళ్లని ప్రభావితం చేయడానికే ఎన్నికల ప్రచార హడావుడి అంతా. అయితే ఇప్పుడు దాదాపు 70 నుంచి 80 శాతం మంది ముందుగానే డిసైడ్ అయి వుంటున్నారు. ఏ ప్రచారమూ వారిని మార్చడం లేదు. ఈ మార్పు కారణంగానే వేవ్ అని కనిపించడం లేదు.

ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా, డిజిటల్ యుగం నడుస్తోంది. ప్రతీదీ రికార్డ్ నే. ఎటు వచ్చి ఏమవుతుందో తెలియదు. అందుకే ఎవ్వరూ పెదవులు విప్పడానికి పెద్దగా ఉత్సాహ పడడం లేదు. కేవలం హార్డ్ కోర్ పార్టీ జనాలు మాత్రమే కాస్త ధైర్యంగా ముందుకు వస్తున్నారు. మిగిలిన వారంతా సైలంట్ గా వుండడంతో, వేవ్ వుందా లేదా అన్నది రాజకీయ పరిశీలకులకు అంతుపట్టడం లేదు.

తమ పార్టీ జనాలు ఊగుతున్నదాన్ని బట్టి ఏ పార్టీకి ఆ పార్టీ వేవ్ తమకే అనుకూలంగా వుందనుకుంటున్నాయి. కానీ అసలు వ్యవహారం తమకు అంతుపట్టనిది ఏదో వుందని లో లోపల అనుమాన పడుతున్నారు. ఈ లోగా తూతూ మంత్రం సర్వేలు తామరతంపరగా నిత్యం వస్తూనే వుంది. ఇవన్నీ పార్టీలకు ఊపు తేవడానికి తప్ప వేరు కాదు. ఎందుకంటే సర్వేలు చేయడం అంత వీజీ కాదు.

అయితే ఇక్కడ మరో ముచ్చట కూడా వుంది. ఇప్పటికి చాలా సర్వే సంస్థలు వైకాపాకు 50 నుంచి 60 సీట్లు కేటాయిస్తూ జోస్యం చెబుతున్నాయి. అంటే మరి వేవ్ ఎక్కడ వున్నట్లు? వేవ్ లేకుండా ఏ ఎన్నిక ముగియదని అనుభవజ్ఙులు చెబుతున్నారు. అందవల్లే ఈ ఎడ్జ్.. పోటా పోటీగా వుంది అనే మాటలు ఎవరూ నమ్మడం లేదు.

ఏటో అటు వేవ్ అనేది వుందని, అది సైలంట్ గా వస్తుందనే చాలా మంది నమ్ముతున్నారు. ఆ సైలంట్ వేవ్, జనం వివిధ పథకాలు అందుకుంటున్న కారణంగా జగన్ వైపు వున్న వేవ్ నా? లేదా అభివృద్ది లేదంటూ తెలుగుదేశం చేస్తున్న ప్రచారం నమ్మితే వస్తున్న వేవ్ నా.

ఇది మాత్రం అటు పార్టీల జనాలు, సర్వే కింగ్ లు అని చెప్పుకుంటున్న జనాలు మాత్రం చెప్పలేకపోతున్నారు. అది 13 తరువాతే తెలుస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?