Advertisement

Advertisement


Home > Politics - Andhra

జ‌గ‌న్‌, బాబు ఇంట‌ర్వ్యూలు... సీఎం క్రేజ్ వామ్మో!

జ‌గ‌న్‌, బాబు ఇంట‌ర్వ్యూలు... సీఎం క్రేజ్ వామ్మో!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు ఎంత ప్ర‌జాద‌ర‌ణ వుందో, గ‌త రాత్రి ఒకే స‌మ‌యంలో ప్ర‌సార‌మైన ఇంట‌ర్వ్యూలు తేల్చి చెప్పాయి. టీవీ9లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో ర‌జ‌నీకాంత్‌, టీడీపీ అనుకూల చాన‌ల్ ఏబీఎన్‌లో మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడితో ఎండీ వేమూరి రాధాకృష్ణ ఇంట‌ర్వ్యూలు చేశారు. ఈ రెండు ఇంట‌ర్వ్యూలు రాత్రి 8 గంట‌ల‌కు ఒకే సారి ప్రారంభ‌మ‌య్యాయి.

టీవీ9లో జ‌గ‌న్ ఇంట‌ర్వ్యూను లైవ్‌లో అత్య‌ధికంగా 70 వేల మంది వీక్షించారు. ఇదే చంద్ర‌బాబునాయుడి ఇంట‌ర్వ్యూను అత్య‌ధికంగా చ‌చ్చీచెడి 20 వేల మంది చూడ‌డం గ‌మ‌నార్హం. దీన్ని బ‌ట్టి చూస్తే... అస‌లు జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ద‌రిదాపుల్లో కూడా చంద్ర‌బాబు లేర‌ని  స్ప‌ష్ట‌మైంది.

వైఎస్ జ‌గ‌న్‌కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో గ‌త రాత్రి ఇంట‌ర్వ్యూను లైవ్‌లో వీక్షించిన సంఖ్యే తేల్చి చెబుతున్న‌ది. చంద్ర‌బాబుకు ఎల్లో మీడియా హైప్ ఇవ్వ‌డం త‌ప్పితే, ఆయ‌న్ను ప‌ట్టించుకునే వారెవ‌రూ లేర‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. జ‌గ‌న్ ఏం చెబుతారో వినాల‌న్న ఆస‌క్తిని పెద్ద సంఖ్య‌లో నెటిజ‌న్లు ప్ర‌ద‌ర్శించ‌డం విశేషం. ఒక‌వైపు జ‌గ‌న్ గ్రాఫ్ అంత‌కంత‌కూ పెరుగుతోంటే, మ‌రోవైపు చంద్ర‌బాబునాయుడికి ప‌డిపోతోంద‌నేందుకు ఇంట‌ర్వ్యూను చూసే వాళ్లే లేక‌పోవ‌డాన్ని చూపుతున్నారు.

చంద్ర‌బాబు రాజ‌కీయ అవ‌కాశం వాదంతో యూట‌ర్న్‌లు తీసుకోవ‌డ‌మే త‌న విధానంగా మార్చుకోవ‌డాన్ని ప్ర‌జ‌లు హ‌ర్షించ‌డం లేదు. అందుకే ఆయ‌న చెప్పింది విన‌డానికి జ‌నం ఆస‌క్తి చూప‌లేద‌ని అంటున్నారు. ఇదే జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే.. విశ్వ‌స‌నీయ‌త‌కు రోల్ మోడ‌ల్‌గా నిలిచారు. ఆ కార‌ణంగానే ఆయ‌న‌కు క్రేజ్ పెరిగింది. ఆ క్రేజ్ గ‌త రాత్రి టీవీ9 ఇంట‌ర్వ్యూ చూడ‌డంలో ప్ర‌తిబింబించింద‌నే టాక్ వినిపిస్తోంది.

చంద్ర‌బాబు విష‌యానికి వ‌స్తే... ప‌చ్చి అవ‌కాశ‌వాది అని, అవ‌స‌రాల కోసం ఏమైనా చెబుతార‌ని, విన‌డానికి ఏమీ వుండ‌ద‌నే అస‌హ‌నం ఆయ‌న ఇంట‌ర్వ్యూను చూడ నిరాక‌రించ‌డంలో ప్ర‌తిబింబించింద‌ని అంటున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?