Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మనోళ్ల సినిమా.. తమిళం, కన్నడ, హిందీల్లో రీమేక్?

మనోళ్ల సినిమా.. తమిళం, కన్నడ, హిందీల్లో రీమేక్?

ఇప్పటికే ‘పెళ్లి చూపులు’ సినిమాను తమిళంలో తీస్తానని దర్శకనిర్మాత గౌతమ్ మీనన్ ప్రకటించాడు. తెలుగులో అత్యల్ప బడ్జెట్ తో రూపొంది సంచలన విజయాన్ని సాధించిన ఈ సినిమా పట్ల గౌతమ్ ఆసక్తితో ఉన్నాడు. ఆ సంగతలా ఉంటే.. ఈ సినిమాను రీమేక్ చేయడానికి కన్నడీగులు రెడీ అయ్యారని సమాచారం. 

మెజారిటీగా రీమేక్ సినిమాలే వచ్చే కన్నడనాట ‘పెళ్లి చూపులు’ రీమేక్ కానున్నదట. అక్కడి యువహీరోహీరోయిన్లతో ఈ సినిమాను తీయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే హక్కులు కూడా కొన్నట్టు సమాచారం. 

అలాగే ఈ సినిమా హిందీ రీమేక్ ప్రతిపాదన కూడా ఉంది. కరణ్ జొహార్ ఈ సినిమాను రీమేక్ చేసే ఆసక్తితో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే బాలీవుడ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.

ఏకంగా తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్ అంటే.. దీని రూపకర్తల పంట పండినట్టే. హిట్టు సినిమా.. మూడు భాషల్లో రీమేక్ అంటే.. రీమేక్ రైట్స్ రూపంలో భారీగానే సొమ్ము సమకూరే అవకాశాలున్నాయి. అయితే తమిళ, హిందీ రీమేక్ ప్రతిపాదనల గురించి ఇంకా అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?