Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

పందిపిల్ల ఈనేదెపుడో?

పందిపిల్ల ఈనేదెపుడో?

అప్పుడెపుడో ప్రకటించాడు కమెడియన్, విలన్, కమ్ డైరక్టర్ రవిబాబు పంది పిల్లను కీలకపాత్రలో పెట్టి సినిమా తీస్తున్నా అని. ఆ తరువాత అడపాదడపా, అవకాశం దొరికినపుడల్లా ఆ పంది పిల్లను జనాలకు చూపిస్తూ వచ్చాడు. సినిమా విశేషాలు చెబుతూ వచ్చాడు. 

కానీ ఇప్పుడు వున్నట్లుంది వ్యవహారం సైలెంట్ అయిపోయింది. రవిబాబు ఏం చేస్తున్నారో? పందిపిల్ల ఏ మేరకు పెరిగిపోయిందో? తెలియడం లేదు. పంది పిల్లగా వున్నపుడు సినిమా స్టార్ట్ చేసారు. ఇప్పుడు పిల్ల కాస్తా పెద్దయిపోతే, కంటిన్యూటీ సమస్య. మళ్లీ గ్రాఫిక్స్ లో సైజులు కట్ చేయడం లాంటి సమస్యలు. 

ఏదో ఆవేశంలో ప్రారంభించి, ఇటీవల ఏమాత్రం బాగా లేకున్నా సినిమాలను మార్నింగ్ షో నుంచే వెనక్కు పంపేస్తున్నారని, కాస్త ముందు వెనుక లాడుతున్నారో? లేక సరైన టైమ్ కోసం వెయిట్ చేస్తున్నారో రవిబాబు చెబితేనే తెలిసేది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?