Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

నిఖిల్ వైపు చూస్తున్న ఇంద్రగంటి

నిఖిల్ వైపు చూస్తున్న ఇంద్రగంటి

నాని అష్టా చెమ్మా నుంచి నాని జెంటిల్ మన్ వరకు సినిమాలు చేసినా, సరైన హిట్ ఖాతాలో పడలేదు ఇంద్రగంటి. అన్నీ గట్టెక్కేసిన సినిమాలే. తొలి సినిమా అష్టా చెమ్మా రేంజ్ హిట్ మళ్లీ రాలేదు. అయితే నాగ చైతన్యతో సినిమా అనుకున్నారు కానీ అది మెటీరియలైజ్ కాలేదు. దాంతో అవసరాల, వెన్నెల కిషోర్, అడవి శేష్ లాంటి వారితో ఓ చిన్న సినిమా చేసారు.

కానీ దీని తరువాత అయినా ఓ మీడియం రేంజ్ సినిమా చేయాలని ఆయన కోరిక. కానీ హీరోలు ఎవరూ అందుబాటులో లేరు. నాని ఇప్పట్లో మళ్లీ ఓకె అంటాడా అన్నది అనుమానం. నాగ్ చైతన్య సంగతీ అంతే. అందుకే ఈసారి నిఖిల్ వైపు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అమీతుమీ పూర్తయింది. జూన్ లో విడుదలవుతుంది. అందుకే తరువాతి ప్రాజెక్టు కోసం ఇంద్రగంటి ఇప్పుడు నిఖిల్ కు కథ చెప్పి ఒప్పించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంద్రగంటి మంచి దర్శకుడే. కానీ చాలా మంది మంచి దర్శకులకు వున్న సమస్యే ఆయనకూ వుంది. సరైన కథ దొరక్క పోవడం. అదే అసలు సమస్య. టేకింగ్ మీద దృష్టి పెట్టే దర్శకులు రామ్ గోపాల్ వర్మ నుంచి సుధీర్ వర్మ వరకు అందరికీ వున్న సమస్య. అందుకే సరైన కథ అంటూ ముందు ఇంద్రగంటి సెట్ చేసుకుంటే, నిఖిల్ డేట్ లు దొరకడం పెద్ద సమస్య కాకపోవచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?