Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

జనసేన సరే, సినిమా సంగతేంటి?

జనసేన సరే, సినిమా సంగతేంటి?

జనసేన పార్టీ ఎంపికలు జోరుగా సాగుతున్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లోనూ జనసైనికుల ఎంపిక కోసం నోటిఫికేషన్లు జారీ చేసేశారు.

ఇప్పటికే పలు జిల్లాల్లో ఎంపికలు పూర్తి కాగా, కొత్తగా ఇతర జిల్లాల్లో ఎంపికల కోసం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ప్రకటన జారీ చేయడంతో, అభిమానులు ఆయా జిల్లాల్లో పోటీ పడ్తున్నారన్నది నిర్వివాదాంశం.

రాజకీయం భలేగుంది. ఇంతకీ, సినిమా సంగతి ఏమయ్యింది.? సాధారణంగా పవన్‌కళ్యాణ్‌ సినిమా సెట్స్‌ మీద వుందంటే, ఆ సినిమా గురించి రోజుకి ఒకటి కాదు, ఐదారు గాసిప్స్‌ సినీ వర్గాల్లో హల్‌చల్‌ చేస్తుంటాయి. అదే సమయంలో సినిమాకి సంబంధించిన ఏదో ఒక న్యూస్‌ బయటకు వస్తుంటుంది.

పవన్‌కళ్యాణ్‌తో త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న సినిమా విషయంలో అలాంటిదేమీ జరగకపోవడం కాస్తంత ఆలోచించాల్సిన విషయమే. రాజకీయాలపై ఫోకస్‌ పెట్టి పవన్‌, సినిమాపై ఫోకస్‌ తగ్గించాడా.? అన్న అనుమానం అభిమానుల్లోనే కలుగుతోంది.

అదేమీ కాదు, సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతూనే కొన్ని ఫొటోలు మీడియాకి లీక్‌ అవడంతో పూర్తిస్థాయిలో దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమా గురించి జాగ్రత్తలు తీసుకున్నాడన్న ఇంకో వాదనా బలంగా విన్పిస్తోంది.

ఏది నిజమోగానీ, పవన్‌కళ్యాణ్‌ అభిమానులు మాత్రం తమ అభిమాన హీరో కొత్త సినిమా సంగతుల్ని తెలుసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ సినిమాలో పవన్‌ సరసన అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్న విషయం విదితమే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?