మొత్తానికి మొదటివారం పూర్తయ్యాక లింగా సినిమాకు కత్తెర పడింది. దాదాపు అరగంట ట్రిమ్ చేసి పారేసారని తెలుస్తోంది. విడుదలైన తరువాత మొదటి మూడు రోజులు కలెక్షన్ల బాగానే కుమ్మేసాయి. కానీ సోమవారానికి కాస్త డల్ అయింది. అలా అలా శుక్రవారం వరకు ఈడ్చేసారు. మళ్లీ వీకెండ్ వచ్చింది. థియేటర్లలో సరైన సినిమా లేదు.
అందుకనే కాస్త బెటర్ చేస్తే, జనం వస్తారని ఆశించినట్లున్నారు. అరగంట మేరకు సినిమా కోసేసారని వినికిడి. కోత పడిన వాటిలో ఎక్కువగా హోటల్లో నెక్లెస్ దొంగతనం, ట్రయిన్ లో ఫైట్ వ్యవహారం వున్నాయని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ జోలికి పెద్దగా వెళ్లలేదని అంటున్నారు.