దోచేయ్ హిట్టయితే…

ఓ సినిమా హిట్ అయితే నిర్మాతకు లాభం,.హీరోకు, డైరక్టర్ కు కేరీర్ పికప్..ఇప్పుడు దోచేయ్ అనే సినిమా చేస్తున్నాడు సుధీర్ వర్మ. స్వామిరారా లాంటి వైవిధ్యమైన సినిమా చేయడంతో నాగచైతన్య చాన్స్ ఇచ్చాడు. ఈ…

ఓ సినిమా హిట్ అయితే నిర్మాతకు లాభం,.హీరోకు, డైరక్టర్ కు కేరీర్ పికప్..ఇప్పుడు దోచేయ్ అనే సినిమా చేస్తున్నాడు సుధీర్ వర్మ. స్వామిరారా లాంటి వైవిధ్యమైన సినిమా చేయడంతో నాగచైతన్య చాన్స్ ఇచ్చాడు. ఈ సినిమాను ఎలాగైనా హిట్ చేయాలని సుధీర్ వర్మ కిందామీదా కష్టపడుతున్నాడు. కేవలం తన కెరియర్ గ్రాఫ్ కోసమే కాదు. ఇంకో కీలకమైన సంగతి వుందని తెలిసింది. 

మహేష్ స్వయంగా సుధీర్ వర్మకు కబురు చేసి, దోచేయ్ కూడా హిట్ కొడితే, తరువాతి సినిమా తనతోనే అని చెప్పాడట. మూడో సినిమాకే మహేష్  సినిమా చేసే చాన్స్ అంటే చిన్న విషయం కాదు. ఆప్ కోర్స్ కొరటాల శివ కు రెండో సినిమాకే దొరికింది ఆ చాన్స్. అది వేరే సంగతి. అందుకే సుధీర్ వర్మ తెగ టెన్షన్ పడుతూ, దోచేయ్ సినిమా కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడట.