ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ను హిట్ సినిమా తీసి ఒప్పించడం ఎంతకష్టంగా వుందో, హీరోలకు కథలు చెప్పి ఓకె అనిపించుకోవడం కూడా అలాగేవుంది. ఏ కథయితే ఓకె అవుతుందో, ఏ పాయింట్ అయితే వెరైటీగా వుంటుందో, మళ్లీ అక్కడ కమర్షియల్ గా ఎలా వుంటుందో? అని కిందామీదా పడడంతోనే సరిపోతోంది. ఇపుడు లీడింగ్ దర్శకుడు వినాయక్ దీ ఇదే సమస్య.
ఆయన టేకింగ్ తో ఓకె చేయగలడు కానీ, కథలు కాదు అని ఒక ముద్ర పడుతోంది. అల్లుడు శీను లాంటి భారీ సినిమాకే ఆయన సరైన కథ ఇవ్వలేదు. చిరంజీవి బ్లాంక్ చెక్ ఆఫర్ మాదిరిగా వినాయక్ కే తొలి చాన్స్ ఇచ్చాడు. కానీ ఆయనను మెప్పించే కథ చెప్పలకే వదిలేసారు. ఇప్పుడు నాగ్ దగ్గర అఖిల్ ను పరిచయం చేసే చాన్స్ తీసుకున్నారు. అక్కడా కథ వంటకం దగ్గరే ఆగిపోయింది వ్యవహారం అని వినికిడి.
ఇదిలా వుంటే నిజమో, అబద్ధమో ఇండస్ట్రీలో ఒక గుసగుస మాత్రం వుంది. వినాయక్ దగ్గరకు కొత్త కథకులు అంత త్వరగా వెళ్లలేరని, ఆయన ఒక్క ఆకుల శివతో మాత్రమే సెట్ అవుతారని, నిర్మాతలు కొత్త కథలు వేరే వాళ్ల దగ్గర నుంచి తెచ్చి వినిపించినా, శివ, వినాయక్ వీటో చేస్తారని అంటారు.
మరి ఎంతవరకు నిజమో తెలియదు. నిజమే అయితే చాలా ఇబ్బందే. ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాముందో తెలియదన్నట్లు, ఒక్కో బుర్రలో ఒక్కో డిఫరెంట్ అయిడియా వుంటుంది. అలాంటపుడు ఒక్కర్నే నమ్ముకుంటే ఎలా?