జర్నలిజం అన్నది ఏనాడో కిందకు జారిపోయే పనిలో పడింది. శ్రీశ్రీ ఆనాడే చెప్పనే చెప్పాడు..పెట్టుబడి దారుల విషపుత్రికలు….మన పత్రికలు…అని. టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్ వైరం ఇవ్వాల్టిది నిన్నటిది కాదు. పత్రికల సర్క్యులేషన్ పెంచుకోడవానికి నానా మార్గాలు అవలంబిస్తుంటాయి అన్ని పత్రికలూ కూడా. ఎదుటి పేపర్ కొనేవారికి తమ పేపర్ ఫ్రీగా ఇవ్వడం, ఆఫర్లు, బహుమతులు ఇవ్వడం, ఇలా చాలా చాలా.
టైమ్స్ ఆఫ్ ఇండియా అడుగుపెట్టిన ప్రతి చోటా, మార్కెట్ ను పాడు చేస్తుందని మిగిలిన పత్రికల మార్గెటింగ్ జనాలు అంటారు. తనకున్న ఆర్థికబలంతో, ముందుగా మార్కెట్ ను చిన్నాభిన్నం చేసి, ఆపై మోనీపలీ వచ్చాక, సంపాదించుకోవడం అన్నది కార్పొరేట్ వ్యూహాల్లో ఓ భాగం.
ఇదిలా వుంటే క్రానికల్ లో ప్రచురించే క్లాసిఫైడ్ ప్రకటనలను టైమ్స్ ఆఫ్ ఇండియా ఫ్రీగా ప్రచురించేస్తోందట. చిత్రం ఏమిటంటే, సాధారణంగా క్లాసిఫైడ్ ప్రకటన్లలో బాక్స్ నెంబర్ ఆ పత్రికలదే వుంటుంది. ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆ బాక్స్ నెంబర్లు కూడా డిసి వే వాడుతొందట. దీనిపై డిసి ఇప్పుడు కోర్టుకెక్కింది. ఆఖరికి పోటీ ఇంతకు దిగజారిందన్నమాట.