మిస్టర్ జగన్….. వాటీజ్ దిస్?

పోతూ పోతూ కొంపకు నిప్పెట్టి పోయాడట వెనకటికి ఎవరో? వైకాపా పార్టీని జనం వీడిపోవడం పెద్ద సమస్య కాదు. తెప్పలుగ చెరువు నిండిన కప్పులు పదివేలు చేరు అన్నాడు సుమతీకారుడు. అందువల్ల టైమ్ వస్తే…

పోతూ పోతూ కొంపకు నిప్పెట్టి పోయాడట వెనకటికి ఎవరో? వైకాపా పార్టీని జనం వీడిపోవడం పెద్ద సమస్య కాదు. తెప్పలుగ చెరువు నిండిన కప్పులు పదివేలు చేరు అన్నాడు సుమతీకారుడు. అందువల్ల టైమ్ వస్తే వస్తారు..లేకుంటే పోతారు. అందువల్ల దాని గురించి చింత పడనక్కర లేదు. రాజకీయాలు వ్యాపారంగా మారిపోయిన కాలంలో అయిదేళ్లు ఏ ఆదాయం లేకుండా ప్రతిపక్షంలో పడి వుండడానికి, ఈ పొలిటికల్ బిజినెస్ మెన్ లు వెర్రాళ్లు కాదు. కానీ పోతూ పోతూ, పార్టీని వీడిపోతూ వీళ్లు చేస్తున్న వ్యాఖ్యనాలు చిత్రంగా వున్నాయి. ఆలోచింపచేసేవిగా వున్నాయి..పార్టీ అధ్యక్షుడు జగన్ ఆలోచించి తీరాల్సినవిగా వున్నాయి..ఆపై మరొకరు ఆ రీతిగా మాట్లాడడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పేలా వున్నాయి. 

పార్టీలోంచి వెళ్లిపోయేవాళ్లు ఏదో ఒక విమర్శ లేదా ఆరోపణ చేయకుండా ఎలాగూ వెళ్లలేరు.వాటన్నింటికి సమాధానాలు చెప్పాల్సిన పని లేదు అని అనుకోవడం ఒక ఏంగిల్. కానీ అదే సమయంలో ఆ ఆరోపణలు, విమర్శలు పార్టీలో మిగిలిన జనాలపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయి, వారి ఆలోచనలను ఏ మేరకు ప్రభావితం చేస్తాయి అన్నది కూడా చూడాలి. ఎందుకంటే సహజంగా వాస్తవానికి దగ్గరగా వుండే ఆరోపణలు చేసేందుకే చూస్తారు వెళ్లిపోయేవారు. దానివల్ల వారికి సరైన డిఫెన్స్ లభిస్తుంది. కానీ అదే పరిస్థితుల్లో వున్న మిగిలిన వారు.,..నిజమే కదా..మనమూ అదే తరహా సమస్యలు ఎదుర్కొంటున్నాం అన్న ఆలోచనకు దిగితే…? 

ఎవ్వడికోసం..ఎవడున్నాడు..పొండిరా పొండి అనుకుంటే, అయిదేళ్లు పార్టీ, ఉద్యమాలు, పోరాటాలు జరపడం ఎలా?

అసలు పార్టీలో వైఎస్ కుటుంబంతో బంధుత్వం లేదా, సన్నిహిత్వం వున్నవారి వ్యవహారాలు ఎలా వున్నాయి. 

వారికి సర్దిచెప్పలేక జగన్ జనాలను వదులుకుంటున్నారా?

బంధువుల వల్ల జగన్ ఇబ్బందుల్లో పడుతున్నారా?

నిజంగానే తను నమ్మిన వారిపై వచ్చిన ఫిర్యాదులను, లేఖలను జగన్ పట్టించుకోకుండా పక్కన పడేస్తున్నారా?

ఇలా చాలా అనుమానాలు రెకెత్తిస్తున్నారు వెళ్తున్నవాళ్లంతా. ఇప్పుడు జూపూడి వైనమే చూసుకుంటే కనీసం సుబ్బారెడ్డి, బాలినేని అయినా విషయం జనాలకు వివరించాలి. లేదూ జూపూడి తాను జగన్ కు రాసిన లేఖను మీడియాకు ఇచ్చారనుకోండి. అప్పుడైనా జనానికి సమాధానం చెప్పాలి కదా..ఎందుకు చర్య తీసుకోలేదో..అసలు ఏం చేసారో?

అలా కాకుండా వెళ్లిపోయేవారి మాటలకు సమాధానాలు చెప్పక్కరలేదంటే, ఇటువంటి వ్యవహారాలకు కారణమైన వారికి మరింత ధిలాసా పెరిగిపోతుంది. వారి వ్యవహారాలు అలాగే సాగుతాయి. దానివల్ల పార్టీ అధిష్టానం చాతకనాని తనానినికి, జగన్ పట్టించుకోని తనానికి మరింత పాపులారిటీ వచ్చేస్తుంది. పార్టీకి జరగాల్సిన డామేజీ జరిగిపోతుంది.

చాణక్య

[email protected]