మృత్యువుతో పోరాడుతన్న క్రికెటర్‌

మైదానంలో క్రికెట్‌ ఆడుతూ గాయపడ్డ క్రికెటర్లు చాలామందే వున్నారు. అయితే, చాలా కొద్ది సందర్భాల్లోనే తీవ్రమైన గాయాలు తగులుతుంటాయి ఆటగాళ్ళకి. అలాంటి అరుదైన సందర్భం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఫిలిప్‌ హ్యూజ్స్‌ క్రికెట్‌ ఆడుతూ…

మైదానంలో క్రికెట్‌ ఆడుతూ గాయపడ్డ క్రికెటర్లు చాలామందే వున్నారు. అయితే, చాలా కొద్ది సందర్భాల్లోనే తీవ్రమైన గాయాలు తగులుతుంటాయి ఆటగాళ్ళకి. అలాంటి అరుదైన సందర్భం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఫిలిప్‌ హ్యూజ్స్‌ క్రికెట్‌ ఆడుతూ తీవ్రంగా గాయపడ్డాడు. ఓపెనర్‌గా ఇప్పటికే ప్రపంచ క్రికెట్‌లో తన సత్తా చాటుకున్న హ్యూజ్స్‌, త్వరలో భారత్‌తో జరగనున్న టెస్ట్‌ సిరీస్‌లో ఆడాల్సి వుంది.

అయితే సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్స్‌లో, దేశవాలీ మ్యాచ్‌లో ఆడుతూ తీవ్రంగా గాయపడ్డాడు హ్యూజ్స్‌. బౌలర్‌ విసిరిన బౌన్సర్‌ని ఆడుతున్న సమయంలో బంతి, హ్యూజ్స్‌ మెడ భాగంలో గట్టిగా తగిలింది. ఫాస్ట్‌ బౌలర్‌ కావడంతో, తగిలిన దెబ్బకి హ్యూజ్స్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పరిస్థితిని గమనించిన నిర్వాహకులు, ఆఘమేఘాలమీద హెలికాప్టర్‌ని రప్పించి, హ్యూజ్స్‌ని ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం హ్యూజ్స్‌ పరిస్థితి విషమంగానే వున్నట్లు వైద్యులు చెబుతున్నారు. తమ అభిమాన క్రికెటర్‌ కోలుకోవాలంటూ ఆస్ట్రేలియా క్రికెట్‌ అభిమానులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు. ఆసీస్‌ క్రికెట్‌ జట్టు సభ్యులంతా హ్యూజ్స్‌కి చికిత్స అందుతోన్న ఆసుపత్రికి వెళ్ళి, తమ సహచరుడి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.

ఇప్పటికే హ్యూజ్స్‌కి శస్త్ర చికిత్స చేయగా, కోమాలోకి వెళ్ళే ప్రమాదం వుందని డాక్టర్లు వెల్లడించారు.