బెంగాల్ టైగర్..పక్కా నాన్ వెజ్

బెంగాల్ టైగర్ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పమంటే హీరో రవితేజ చెప్పిన మాట..ఇదే. పక్కా నాన్ వెజ్ అని. అంటే ఆయన భాషలో పక్కా మాస్ మసాలా ఎంటర్ టైనర్ అని. బెంగాల్…

బెంగాల్ టైగర్ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పమంటే హీరో రవితేజ చెప్పిన మాట..ఇదే. పక్కా నాన్ వెజ్ అని. అంటే ఆయన భాషలో పక్కా మాస్ మసాలా ఎంటర్ టైనర్ అని. బెంగాల్ టైగర్ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పుడు బయటకు విడుదలచేసారు.

ఈ లుక్ చెబుతోంది..రవితేజ మాటలు నూటికి నూరు శాతం నిజం అని. రవితేజ మార్కు ఫోజు..చుట్టూ గన్స్,,ఆపై జీపుపై గన్స్ పట్టుకున్న గ్లామర్ ఫిగర్లు..ఇవన్నీచెప్పకనే చెబుతున్నాయి..సినిమా వైనం ఏమిటో?

దర్శకుడు సంపత్ నంది కూడా సినిమాను పక్కా మాస్ ఎంటర్ టైనర్ గానే తీయాలనే తప్ప, మరే విధమైన ఫాల్స్ ప్రెస్టీజ్ లకు పోవాలని అనుకోవడం లేదట. ఈ సినిమాకు దాదాపు 22 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు వినికిడి. రవితేజ మార్కెట్, శాటిలైట్ మార్కెట్ అంచనా వేసుకునే ఇంత ఖర్చు పెడుతున్నాం అంటున్నారు నిర్మాతలు.