అరవింద్ సినిమాపై వైవిఎస్ ఆశలు

సీజన్లు వస్తుంటాయి..పోతుంటాయి. కానీ రేయ్ లాంటి సినిమాలు విడుదలకు నోచుకోకుండా వాయిదాలు పడుతుంటాయ్. చూస్తుంటే వ్యవహారం అలాగే వుంది. సాయిధరమ్ తేజ్ రెండోసినిమా పిల్లా నువ్వులేని జీవితం చకచకా రెడీ అయిపోతోంది.  Advertisement అరవింద్…

సీజన్లు వస్తుంటాయి..పోతుంటాయి. కానీ రేయ్ లాంటి సినిమాలు విడుదలకు నోచుకోకుండా వాయిదాలు పడుతుంటాయ్. చూస్తుంటే వ్యవహారం అలాగే వుంది. సాయిధరమ్ తేజ్ రెండోసినిమా పిల్లా నువ్వులేని జీవితం చకచకా రెడీ అయిపోతోంది. 

అరవింద్ నిర్మాత కాబట్టి అంతా ఓ పద్దతిగా, ప్లాన్డ్ గా వుంటుంది. రవికుమార్ చౌదరి డైరక్టర్ గా ఫరవాలేదు. ఇదే ఇప్పుడు రేయ్ సినిమా నిర్మాత కమ్ దర్శకుడు ఆశగా వుందట. తాను ఎలాగూ రేయ్ సినిమాను విడుదల చేసే స్థితిలోలేడు.

పిల్లా నువ్వులేని జీవితం కనుక విడుదలై,. ఫరవాలేదనే టాక్ తెచ్చుకుంటే తన సినిమాకు బయ్యర్లు వస్తారని, అప్పుడు ఆటోమెటీక్ గా సినిమా విడుదలైపోతుందని భావిస్తున్నాడట. అందుకే మరింక ఎటువంటి ప్రకటనలు ఇవ్వడం మానేసి కూల్ గా కూర్చున్నాడని కృష్ణానగర్ కోడై కూస్తోంది.