ప్రభుదేవా బాట‌లో లారెన్స్‌

ద‌క్షిణాదిలో ప‌ది సినిమాలు చేస్తే ఎంతో… బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తే అంత‌. ఈ విలువ తెలుసుకొన్న ప్రభుదేవా… బాలీవుడ్‌కి అంత‌కిత‌మైపోయాడు.ఇప్పుడు అదే దారిలో లారెన్స్ కూడా వెళ్లబోతున్నాడు. హిందీలో ఓ సినిమా…

ద‌క్షిణాదిలో ప‌ది సినిమాలు చేస్తే ఎంతో… బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తే అంత‌. ఈ విలువ తెలుసుకొన్న ప్రభుదేవా… బాలీవుడ్‌కి అంత‌కిత‌మైపోయాడు.ఇప్పుడు అదే దారిలో లారెన్స్ కూడా వెళ్లబోతున్నాడు. హిందీలో ఓ సినిమా చేయాల‌ని లారెన్స్ ఎప్పటి నుంచో అనుకొంటున్నాడు. 

ముని సినిమాని అక్కడ అజ‌య్‌దేవ‌గ‌ణ్‌తో రీమేక్ చేయాల‌ని చూస్తున్నాడు. వీటితో పాటు తెలుగులో విజ‌య‌వంత‌మైన కొన్ని సినిమాల్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయాల‌ని చూస్తున్నాడు. దానికి సంబంధించిన రీమేక్ రైట్స్ త‌న ద‌గ్గర ఉంచుకొనే ప్రయ‌త్నాల్లో ఉన్నాడు లారెన్స్‌. ముందు.. త‌న మాస్ సినిమాని అక్కడ మ‌ళ్లీ తీయాల‌నుకొంటున్నాడు. ఈ సినిమాని కొంత‌మంది బాలీవుడ్ క‌థానాయ‌కుల‌కు చూపించాడ‌ట‌. 

అయితే ఇంత వ‌ర‌కూ ఎవ‌రూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. త్వర‌లోనే ఓ అగ్రక‌థానాయ‌కుడితో ఓకే చేయించుకోవాల‌ని విశ్వప్రయ‌త్నాలు చేస్తున్నాడు.  ప్రభుదేవా కూడా ద‌క్షిణాది సినిమాల్ని రీమేక్‌లు చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడు లారెన్స్ ఫాలో అయిపోతున్నాడన్నమాట‌.