మూడు తరాల నటులు కలసి నటిస్తున్న మనం సినిమా లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన పాత్ర షూటింగ్ పూర్తయింది. అంతే కాదు అక్కినేని నాగేశ్వరరావు పాత్రకు సంబంధించి డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయని ఫిలిం నగర్ టాక్.
ఇష్క్ సినిమా తెరకెక్కించిన విక్రం కుమార్ దర్శకత్వం లో రూపు దిద్దుకుంటున్న మనం సినిమా ను ఫిబ్రవరిలో రిలీజ్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. అక్కినేని నాగేశ్వర రావుకు ఆనారోగ్యం కారణంగా తొలుత ఆయనపై చిత్రీకరించాల్సిన సన్నివేశాలను తీసేశారని, ఆయనకు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేశారని తెలుస్తోంది.
మూడు తరాల హీరోలు కలసి నటించిన తెలుగులో తొలి సారిగా వస్తున్న మనం సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.