గోవా లో జరిగేది చివరి షెడ్యులేనా?

మహేష్‌ హీరోగా నటిస్తున్న వన్‌ ఒక్కడినే సినిమా చాలా రోజుల నుంచి షూటింగ్‌ జరుపుకుంటోంది. ప్రస్తుతం గోవా లో షూటింగ్‌ జరుగుతోంది. అయితే ఇదే షెడ్యుల్‌ ఈ సినిమాకు చివరి షెడ్యుల్‌ అని అంటున్నారు…

మహేష్‌ హీరోగా నటిస్తున్న వన్‌ ఒక్కడినే సినిమా చాలా రోజుల నుంచి షూటింగ్‌ జరుపుకుంటోంది. ప్రస్తుతం గోవా లో షూటింగ్‌ జరుగుతోంది. అయితే ఇదే షెడ్యుల్‌ ఈ సినిమాకు చివరి షెడ్యుల్‌ అని అంటున్నారు నిర్మాతలు. మహేష్‌ బాబు థియేటర్‌ లో కనిపించకుండా సుమారు ఏడాది అవుతోంది.

‘సీతమ్మ వాకిట్లో..’ తరువాత మహేష్‌ థియేటర్‌ లోకి రాలేదు. దీంతో ఆయన ఫ్యాన్స్‌ కంగారుగా ఉన్నారు. సుకుమార్‌ దర్శకత్వం లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా యాక్షన్‌ నేపద్యం లో సాగుతుంది. అయితే దర్శకుడు మాత్రం ఇప్పుడు జరుగుతున్నది చివరి షెడ్యులే నని చెబుతున్న నిర్మాతలు మాత్రం నమ్మడం లేదట. 

మరి సుకుమార్‌ నిజంగానే గోవాలో జరుగుతున్నది చివరి షెడ్యుల్‌ అని ప్రకటించి చిత్ర నిర్మాణం పూర్తి చేస్తాడో లేక మల్లి రీ షూట్‌ లాంటివి ఏమైనా చేస్తాడో చూడాల్సిందే అంటున్నారు సినిమా వర్గాలు.