ఎంత కాదన్నా తెలుగుదేశం పార్టీపై జూనియర్ కు అభిమానం ఎంతో కొంత వుంది. రామయ్యా వస్తావయ్యా సినిమాలో ఇది కాస్త బయటపడింది. ఓ పాట చిత్రీకరణలో సైకిల్ ను తరచు వాడారు.
నిజానికి సన్నివేశం పరంగా అక్కడ సైకిల్ అవసరం లేదు. కానీ సైకిల్ తీసుకుని ఎక్కినట్లు, సైకిల్ ను ప్రదర్శిస్తూ కొన్ని సన్నివేశాలు ఇమిడ్చారు. అదే విధంగా ఇటీవల చంద్రబాబు సామాజిక వర్గం ఎన్టీఆర్ ను పెద్దగా ఇష్టపడని సంగతి, ఎస్ఎమ్ఎస్ లు ఇవ్వడం వగైరా వ్యవహారాలు జరిగాయి.
బహుశా ఈ కులపిచ్చ పనికిరాదనో, లేక కులాలన్నీ ఏనాడో సంకరమైపోయాయనో చెప్పాలనే కావచ్చు..రామయ్యా వస్తావయ్యాలో..ప్రారంభంలోనే కులాలకు సంబంధించి దుర్యోధనుడి డైలాగులు వల్లించాడు.