31న ఎవడు?

దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమాల్లో రామ్ చరణ్ ‘ఎవడు’ ఒకటి. సెన్సార్  కూడా అయిపోయి, విభజన ఉద్యమాల కారణంగా విడుదల కాకుండా ల్యాబ్ ల్లో వుండిపోయింది. ఈ  సినిమాను ఎలాగైనా ఈ నెలలో…

దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమాల్లో రామ్ చరణ్ ‘ఎవడు’ ఒకటి. సెన్సార్  కూడా అయిపోయి, విభజన ఉద్యమాల కారణంగా విడుదల కాకుండా ల్యాబ్ ల్లో వుండిపోయింది. ఈ  సినిమాను ఎలాగైనా ఈ నెలలో విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నట్లు తెలిసింది. 

31 అయితే బాగుంటుందని భావిస్తున్నట్లు తెలిసింది. దీపావళికి ముందుగా వచ్చినట్లుఅవుతుంది. ఒక వేళ ఏ కారణంగా నైనా విడుదల చేయలేకపోతే, ఇక సంక్రాంతి వరకు అలాగే వుంచేస్తారు. 

రామయ్యా వస్తావయ్యా చాలా వరకు నేరుగా విడుదల చేసాడు కాబట్టి,లాభ నష్టాలు, వసూళ్లు వగైరా సమస్యలన్నీ దిల్ రాజువే. అందువల్ల దీనితో సంబంధం లేకుండానే ఎవడు విడుదల వుండొచ్చు.