నాగార్జున భాయ్ అలా అలా వెనక్కు వెళ్తూ వస్తోంది. ఆఖరికి ఈ నెల 18న విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. రామయ్యా వస్తావయ్యా రిజల్ట్ తెలిసాక నాగార్జున సినిమాను 18న విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. 17న దూసుకెళ్తా వచ్చే అవకాశం వుంది.
Advertisement
దసరా అనంతరం, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా థియేటర్లు చాలా వరకు ఖాళీ అయి అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భాయ్ చాలా వాయిదాలు పడింది. అడియో ఫంక్షన్ చేద్దామనుకుని మళ్లీ వాయిదా వేసారు. ఇక అన్ని అడ్డంకులు తీరాయని, సినిమాను విడుదలచేయాలని నాగార్జన పట్టుదలగా వున్నట్లు తెలుస్తోంది.