బాలీవుడ్‌కి హరీష్‌శంకర్‌

దక్షిణాది కథలు, కథానాయకులు, నాయికలు… బాలీవుడ్‌కి ఎగుమతి అయిపోతున్నారు. ఇప్పుడు దర్శకుల వంతు వచ్చింది. మొన్నామధ్య పూరికి పిలుపొచ్చింది. బుడ్డా తీసి వచ్చాడు. ఇప్పుడు క్రిష్‌ అక్కడికి వెళ్తున్నాడు. ఈలోగా హరీష్‌ శంకర్‌కి ఆఫర్‌…

దక్షిణాది కథలు, కథానాయకులు, నాయికలు… బాలీవుడ్‌కి ఎగుమతి అయిపోతున్నారు. ఇప్పుడు దర్శకుల వంతు వచ్చింది. మొన్నామధ్య పూరికి పిలుపొచ్చింది. బుడ్డా తీసి వచ్చాడు. ఇప్పుడు క్రిష్‌ అక్కడికి వెళ్తున్నాడు. ఈలోగా హరీష్‌ శంకర్‌కి ఆఫర్‌ వచ్చింది. 

నువ్వు మా బాలీవుడ్‌లో ఓ సినిమా చేయాల్సిందే.. అని అక్కడి నిర్మాతలు హరీష్‌ని తెగ బతిమాలేస్తున్నారట. పైగా దక్షిణాది కథల్ని రీమేక్‌ చేసేయ్‌.. అని ఓపెన్‌ ఆఫర్‌ ఇస్తున్నారట. దాంతో హరీష్‌ కూడా బాలీవుడ్‌ వెళ్లిపోవడానికి సన్నాహాలు చేసుకొంటున్నాడు. 

ఇక్కడి కమిట్‌ మెంట్స్‌ అయిపోగానే హిందీలో ఓ సినిమా చేస్తాడట. ఎన్టీఆర్‌ సినిమా రామయ్యా వస్తావయ్యా సినిమాకి కొన్ని మార్పులు చేసి బాలీవుడ్‌లో వదులుతాడట. మరి ఆ సినిమాలో హీరోగా ఎన్టీఆర్‌నే తీసుకొంటాడా??  లేదంటే బాలీవుడ్‌ హీరో కావాలంటాడా??  చూడాలి మరి.