బాలీవుడ్‌లో ఆఫర్ అంటే ఎగిరి గంతేస్తారు. అడిగిందే తడవు.. రెక్కలుకట్టుకొని వాలిపోతారు. కానీ అమలాపాల్ మాత్రం ఆ ఛాన్స్ మిస్ చేసుకోంది. నావల్లకాదు, నే చేయ్యను అని చెప్పేసిందట. తెలుగులో సూపర్ హిట్ సినిమా ఠాగూర్‌ని హిందీలో రీమేక్ చేస్తున్నారు.
క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్‌కుమార్ కథానాయకుడు. ఈసినిమాలో కథానాయికగా అమలాపాల్‌ని ఎంచుకొన్నారు. కానీ అమల మాత్రం సారీ అండీ.. నాకు చాలా సినిమాలున్నాయ్.. అని చెప్పి తప్పించుకొందట. అసలు కారణం మాత్రం వేరే ఉంది. తనకు రెండో నాయిక పాత్ర కట్టబెట్టారని, అది చేయడం ఇష్టం లేకే ఆ ఛాన్స్ వదులుకొందట.
బాలీవుడ్‌లో రెండో నాయిక అయితేనేం…? తెలుగులో చేయడం లేదేంటి?? ఈ సినిమా వదులుకొని అమలా తప్పుచేసిందని ఆమె సన్నిహితులు తెగ ఇదైపోతున్నారు. అమలకు ఆ విషయం ఎప్పుడు అర్థమవుతుందో…?