శ్రీహరి హఠాన్మరణం చిత్రపరిశమను షాక్‌కి గురిచేసింది. అతని అభిమానులు గుండెలు బాదుకొంటున్నారు. నిర్మాతలకైతే గుండెలే ఆగిపోయాయి. శ్రీహరి ఓ బిజీ నటుడు. చేతిలో ఎప్పుడూ అరడజను సినిమాలు ఉండాల్సిందే.
ఇప్పుడూ అదే తీరు. వీకెండ్ లవ్, టీ సమోసా బిస్కెట్ లాంటి సినిమాలు దాదాపు అరడజను ఉన్నాయి. బాలీవుడ్లో రా.. రాజ్‌కుమార్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రభుదేవా దర్శకుడు. ఇప్పుడు ఈ సినిమాలన్నీ ఆగిపోయే పరిస్థితి. వీకెండ్ లవ్ సినిమాదీ అదే కండీషన్. శ్రీహరి పై ఓ షెడ్యూల్ బాకీ ఉంది. అదయితే సినిమా పూర్తయినట్టే.
ఇప్పుడు శ్రీహరి లేడు.. ఆ సినిమాకి భవిష్యత్తూ లేదు. డూప్‌లు పెట్టుకొని రీషూట్లు చేసుకోవడానికి కూడా లేదాయె. ఎందుకంటే శ్రీహరి లాంటి బాడీ ఎవరికి ఉంది?? అంతేకాదు.. చాలా మంది నిర్మాతలు శ్రీహరికి అడ్వాన్సులు కూడా ఇచ్చారు. ఈ సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.