భాయ్ ఇంకా విడుదల కానేలేదు. తన మరుసటి సినిమా గురించి అప్పుడే వీరభద్రం కసరత్తులు ప్రారంభించేశాడు. రవితేజ కోసం ఓ మాస్ మసాలా కథ సిద్థం చేసుకొంటున్నాడు వీరభద్రం .
పనిలో పనిగా కథానాయికలనూ వెతికేస్తున్నాడు. రవితేజ పక్కన చాలామంది నాయికల పేర్లు పరిశీలించి, చివరకు తమన్నా అయితే బాగుంటుందని డిసైడ్ అయ్యాడట. రవితేజ, తమన్నాల కాంబినేషన్ ఇప్పటి వరకూ తెరపై చూసే అవకాశం రాలేదు. దాంతో… ఈ జంట కొత్త కొత్తగా కనిపించి ముచ్చటగొలుపుతుందని వీరభద్రం భావిస్తున్నాడు.
భాయ్ బయటకు రాకమునుపే, ఆ రిజల్ట్ తో సంబంధం లేకుండా రవితేజతో సినిమా ఓకే చేయించుకోవాలని చూస్తున్నాడు వీరభద్రం . డి.వి.వి.దానయ్య కూడా భద్రం ఎప్పుడంటే అప్పుడు సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీగా ఉన్నాడు. ఇక మాస్ మహారాజా పచ్చజెండా ఊపడమే తరువాయి.