బూతు బ్రాండ్‌ పోగొట్టుకోడానికి

బూతు సినిమాలతో సక్సెస్‌ సాధించినా కానీ, దర్శకుడిగా వేగంగా పేరు తెచ్చుకున్నా కానీ అందులో ఉన్న లాభాలతో పాటు నష్టాలేమిటనేది కూడా మారుతికి తెలిసి వచ్చింది. అందుకే తనపై పడ్డ ముద్రని చెరిపేసుకోవడానికి అతను…

బూతు సినిమాలతో సక్సెస్‌ సాధించినా కానీ, దర్శకుడిగా వేగంగా పేరు తెచ్చుకున్నా కానీ అందులో ఉన్న లాభాలతో పాటు నష్టాలేమిటనేది కూడా మారుతికి తెలిసి వచ్చింది. అందుకే తనపై పడ్డ ముద్రని చెరిపేసుకోవడానికి అతను తన వంతు కష్టపడుతున్నాడు. ప్రస్తుతం అల్లు శిరీష్‌తో చేస్తున్న ‘కొత్త జంట’లో ఎలాంటి బూతు ఎలిమెంట్స్‌ ఉండవని మాటిస్తున్నాడు. 

కేవలం ద్వందార్ధ సంభాషణలే కాకుండా కనీసం పొగత్రాగరాదు అనే డిస్‌క్లెయిమర్‌ వేయాల్సిన అవసరం కూడా రాని క్లీన్‌ మూవీ ఇదని మారుతి చెప్తున్నాడు. అల్లు శిరీష్‌కి గౌరవంతో వచ్చిన నెగెటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ తెలిసిన మారుతి అతనిలోని ప్లస్‌ పాయింట్స్‌ తనకి తెలుసని, వాటినే హైలైట్‌ చేస్తానని, హీరోలోని పాజిటివ్‌ పాయింట్స్‌ చూపించడం దర్శకుడి పని అని అన్నాడు. 

పెద్ద హీరోలతో పని చేసే అవకాశాల కోసం చూస్తున్న మారుతి తనకి పలువురు అగ్ర నిర్మాతలు అడ్వాన్స్‌లు ఇచ్చారని, హీరోలని తీసుకొచ్చే బాధ్యత వారిదేనని అంటున్నాడు. కొత్త జంటతో క్లీన్‌ ఇమేజ్‌ తెచ్చుకుంటే మారుతిని అగ్ర హీరోలు దర్శకుడిగా పరిగణిస్తారేమో చూడాలి మరి.