వరద నీటిలో కొట్టుకుపోతున్న వాడు గడ్డి పోచ దొరికినా చటుక్కున అందుకుంటాడు. ఓటమి అంచన నడుస్తున్నామనో, గెలుపు తీరం చాలా దూరం అనే భావమో తెలుగుదేశం అధినేత చంద్రబాబును వెంటాడుతోంది. దాంతో తాను ఏం మాట్లాతుతున్నారో అర్థం కావడం లేదు. గతంలో తాను చెప్పినదేమిటి? ఇప్పుడు మాట్లాడుతున్నదేమిటి? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
వాలంటీర్ వ్యవస్థ ను విమర్శించిన ప్రతిపక్ష నాయకుడు లేరు. అవి ఉద్యోగాలా అని ఎద్దేవా చేయని వారు లేరు. రెండు లక్షల మందికి ఆ విధంగా ఉపాధి కల్పించారని చెబితే, మూటలు మోసే ఉద్యోగాలు అని కించపరిచారు. అలాంటిది ఇప్పుడు అదే చంద్రబాబు ఏమంటున్నారు. తాను అధికారంలోకి వస్తే వలంటీర్ల ఉద్యోగాలు తీయనని, పైగా ముఫై వేల మేరకు జీతాలు పెంచేస్తా అని చెబుతున్నారు.
నిన్నటి వరకు మాట్లాడిన మాటలు వేరు..ఇప్పుడు చెబుతున్నవి వేరు. మరి జనం ఎలా నమ్ముతారు? ఇంటికి పంపిస్తాను పింఛన్లు అంటున్నారు. ఇప్పటి వరకు జగన్ చేసింది అదే. ఇప్పటి వరకు జగన్ ఏదీ చేయలేదని చెబుతూ, సచివాలయాలు కొనసాగిస్తాం. వలంటీర్లకు జీతం పెంచుతాం, ఇళ్లకు పింఛన్లు పంపిస్తాం అని అనడం అంటే ఏమనుకోవాలి? చంద్రబాబూ..
జగన్ విధానాలు జనానికి నచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు వస్తే అవి ఎక్కడ పోతాయో అని జనం భయపడుతున్నారని మీరు గ్రహించారనే కదా. అందుకే కదా ఇప్పుడు చంద్రబాబు నోట ఇలాంటి మాటలు వస్తున్నాయి.
ఎక్కడన్నా పెరిగాయి అంటున్న ధరలు తగ్గిస్తాం అనాలి. పెట్రోలు, డీజిల్ తగ్గిస్తాం అనడం లేదు.. మందు రేట్లు తగ్గిస్తాం అంటున్నారు. ఏం చెప్పాలి.. చంద్రబాబు ఈ నైరాశ్యం నుంచి ఎప్పుడు బయటకు వస్తారో?