రాబిన్ హుడ్ Vs తమ్ముడు

ఈరోజు హీరో నితిన్ నుంచి 2 అప్ డేట్స్ వచ్చాయి. అతడు చేస్తున్న రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాల నుంచి స్పెషల్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. పోస్టర్లు ఎలా ఉన్నాయనే సంగతి పక్కనపెడితే.. నితిన్…

ఈరోజు హీరో నితిన్ నుంచి 2 అప్ డేట్స్ వచ్చాయి. అతడు చేస్తున్న రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాల నుంచి స్పెషల్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. పోస్టర్లు ఎలా ఉన్నాయనే సంగతి పక్కనపెడితే.. నితిన్ చేస్తున్న ఈ రెండు సినిమాలు 2 డిఫరెంట్ స్టోరీస్ తో వస్తున్నాయి. పోస్టర్లు చూస్తుంటే, నితిన్ స్టోరీ సెలక్షన్ బాగుందనిపిస్తోంది.

ముందుగా తమ్ముడు విషయానికొద్దాం.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ సినిమా నుంచి మంచి పోస్టర్ రిలీజైంది. బస్సుపై శూలం పట్టుకొని నితిన్ కూర్చున్నాడు. బస్సులో సీనియర్ నటి లయ కనిపిస్తోంది. ఓ గిరిజన మహిళ చుట్ట తాగుతూ బస్సు డ్రైవ్ చేస్తున్నట్టు చూపించారు. పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది.

ఇక నితిన్ చేస్తున్న రెండో సినిమా రాబిన్ హుడ్ కూడా అంతే ఆసక్తికరంగా ఉంది. కొన్నాళ్ల కిందట ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. నితిన్ ను స్టయిలిష్ దొంగగా పరిచయం చేశారు. కట్ చేస్తే, ఈరోజు విడుదల చేసిన పోస్టర్ లో నితిన్ ఏజెంట్ గెటప్ లో కనిపించాడు. అతడి పాకెట్ లో గన్ ఉంది. షర్ట్ పై ఏజెంట్ ఆర్ హెచ్ (రాబిన్ హుడ్) అని రాసి ఉంది.

తాజా పోస్టర్ తో రాబిన్ హుడ్ ప్రాజెక్టు మరింత ఆసక్తికరంగా మారింది. గతంలో నితిన్ కు భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకీ కుడుముల ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించడం ఇంకాస్త హైప్ క్రియేట్ చేసింది. ఇలా తన సినిమాలతో నితిన్ ఎట్రాక్ట్ చేస్తున్నాడు.

నితిన్ నుంచి రీసెంట్ గా వచ్చిన 2 సినిమాలూ ఫెయిల్ అయ్యాయి. దీంతో సెట్స్ పై ఉన్న ఈ 2 సినిమాలపైనే అతడు ఆశలు పెట్టుకున్నాడు.