హీరోయిన్లంతా వరుసపెట్టి పెళ్లిళ్లు చేసుకుంటున్న వేళ, తనకు ప్రేమించడానికి ఓ అబ్బాయి కావాలంటోంది కృతి సనన్. ప్రస్తుతం బాలీవుడ్ హాట్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ పొడుగుకాళ్ల సుందరి, డేటింగ్ కు ఓ మగాడు కావాలని, భారతీయుడైతే ఇంకా మంచిదని తన మనసులో మాట బయటపెట్టింది.
“శ్వేత జాతీయులు హాట్ గా ఉండొచ్చు కానీ నేను ఇప్పటివరకు ఏ విదేశీయుడికి అంతగా ఎట్రాక్ట్ కాలేదు. నిజం చెప్పాలంటే, భారతీయ పురుషుడి కోసం నేను వెయిటింగ్. దేశీ అయిన వ్యక్తితోనే నేను డేటింగ్ కు ఇష్టపడతాను. నేను దేశీ కాబట్టి హిందీ అర్థం చేసుకునే మగాడైతే ఓకే. నేను ఇంగ్లిష్ పాటలకు ఎక్కువగా డాన్స్ చేయలేను. పంజాబీ, హిందీ సాంగ్స్ కు నాతో కలిసి డాన్స్ చేసే భారతీయ మగాడు కావాలి. అలాంటి వ్యక్తితో డేటింగ్ చేయడానికి ఇష్టపడతాను.”
కొన్ని రోజుల కిందట తన పెళ్లిపై ఫాంటసీగా స్పందించింది కృతి సనన్. స్వయంవరం ఏర్పాటుచేస్తే, తన కోసం విజయ్ దేవరకొండ, కార్తీక్ ఆర్యన్ తో పాటు హాలీవుడ్ నటుడు రెయిన్ గాస్లింగ్ రావాలని ఆమె కోరుకుంది. దానిపై మరోసారి స్పందించిన కృతి.. రైన్ అంటే తనకు ఇష్టమేనని, కానీ భారతీయత ఉన్న మగాడు కోసం వెయిటింగ్ అంటూ ప్రకటించింది.
అయితే ఆమె ఇప్పటికే డేటింగ్ లో ఉందనేది చాలామంది మాట. ధోనీకి చాలా సన్నిహితుడైన కబీర్ బహియాతో కృతి, ప్రేయాయణం సాగిస్తోందనేది బాలీవుడ్ సమాచారం.