Shivam Bhaje Review: మూవీ రివ్యూ: శివం భజే

హనుమాన్, కార్తికేయ టైపులో డివోషనల్ యాక్షన్ సినిమా అందివ్వాలన్న ఆలోచన మంచిదే కానీ, దానికి తగిన కసరత్తు జరిగినట్టు లేదు

చిత్రం: శివం భజే
రేటింగ్: 2/5
తారాగణం: అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశి, అర్బాజ్ ఖాన్, హైపర్ ఆది, మురళి శర్మ, తనికెళ్ల భరణి, బ్రహ్మాజి, తులసి, దేవీప్రసాద్, అయ్యప్ప శర్మ, షకలక శంకర్, కాశీ విశ్వనాథ్, ఇనయ సుల్తానా తదితరులు
సంగీతం: వికాస్
కెమెరా: దాశరథి శివేంద్ర
ఎడిటర్: చోట కె ప్రసాద్
నిర్మాత: మహేశ్వర రెడ్డి మూలి
దర్శకత్వం: అప్సర్
విడుదల: ఆగస్ట్ 1, 2024

అశ్విన్ బాబు మీద ఎంతోకొంత నమ్మకం ఉండడానికి కారణం అతని “హిడింబ” ఒక వర్గం ప్రేక్షకులకి నచ్చడం. అందుకే “శివం భజే” అనగానే కొంత ఆసక్తి కనబరిచారు యువ ప్రేక్షకులు.

కథలోకి వెళితే, చందు (అశ్విన్ బాబు) లోన్ రికవరీ ఏజంట్. శైలజ (దిగంగనా) ఒక కెమికల్ కంపెనీలో పని చేస్తుంటుంది. ఆ ఇద్దరి మధ్య రొమాన్స్ సాగుతుంటుంది. అనుకోని సంఘటనలో హీరోకి రెండు కళ్ళూ పోతాయి. ఆపరేషన్ చేసి కొత్త కళ్లు పెడతారు డాక్టర్లు. ఆపరేషన్ సక్సెస్ అయ్యి చందుకి మళ్లీ కళ్లు కనిపించడం మొదలవుతుంది.

కానీ అప్పటి నుంచి కొన్ని వింత అనుభవాలు ఎదురవుతాయి చందుకి. ఒక కెమికల్ ల్యాబులో జరిగిన హత్యల తాలూకు దృశ్యాలు కనిపిస్తుంటాయి అతనికి. ఈ కొత్తగా వచ్చిన కళ్లకి, ఆ దృశ్యాలకి సంబంధమేంటి? ఆ హత్యలకి కారకులెవరు? దాని వెనుక కుట్రలేవిటి? వీటి చుట్టూ తిరుగుతుంది కథంతా.

అశ్విన్ బాబు నటనలో మెరుపులేవీ లేవు. కుదిరినంత సేపు ఫైట్లు చేయడం, ఉన్నంతలో కామెడీ చేసే ప్రయత్నం చెయడం తప్ప పెద్దగా ఆకట్టుకున్నది లేదు.

దిగంగనా సూర్యవంశి మాత్రం ఫోటోజెనిక్ గా బాగుంది. కథకి అవసరమైన నటన కూడా కనబరిచింది.

మురళి శర్మ, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్.. ఇలా చాలామంది సీనియర్లు గెస్ట్ ఆర్టిస్టులుగా కనిపించారు.

అర్బాజ్ ఖాన్ డబుల్ షేడ్ పాత్రలో కనిపించినా కానీ అకట్టుకోడు.

హైపర్ ఆది అయితే ఓవర్ డోస్ వెగటు కామెడీతో విసిగించాడు. ఒక సన్నివేశమైతే చాలా జుగుప్సాకరంగా ఉంది. హీరోకి దగ్గరుండి మూత్ర విసర్జనం చేయించే సీన్ అది. అసహ్యానికి పరాకాష్టలా ఉంది. మూత్రాన్ని పవిత్రమైన “పాతాళగంగ”తో పోల్చడం దిగజారుడుతనానికి నిదర్శనం.

అలాగే హీరోకి కుక్కతో సంబంధాన్ని అంటగట్టి హైపర్ ఆది చెప్పే డైలాగులు కూడా భావదారిద్ర్యానికి కేరాఫ్ అడ్రస్ లా ఉన్నాయి.

మరొక సన్నివేశంలో షకలక శంకర్ “దవడ” డైలాగ్ కూడా ఛీ అనేలా ఉంది.

ఈ తరహా కామెడీ ట్రాకుల వల్ల రచయిత, దర్శకుడి బ్యాడ్ టెస్ట్ అర్ధమవుతుంది.

ఈ సినిమాలో కథా కథనాల పరంగా ఎన్ని లోపాలున్నా చివరిదాకా కూర్చోబెట్టింది మాత్రం నేపథ్య సంగీతం. ఆ విషయంలో సంగీత దర్శకుడు వికాస్ ని మెచ్చుకోవాలి. వినిపించిన పాటలు కూడా వినేలా ఉన్నాయి.

మెయిన్ ప్లాట్ రాసుకోవడం బానే ఉంది. ముందు నుంచీ కుక్కల ప్రస్తావన తేవడం; శివుడు గణేశుడికి ఏనుగు తల పెట్టడం గురించి హీరోతో ఒక డైలాగ్ చెప్పించడం; హీరోకి శివుడిపై అపనమ్మకం…అన్నీ కథలో బాగా ఒదిగాయి.

కానీ పేపర్ మీద ఫిక్షన్ కథగా బాగానే ఉందనిపించినా తెర మీద సినిమాగా మలచడంలో కావాల్సిన డెప్త్ ని చూపించలేకపోయాడు దర్శకుడు. కాసేపు అంతర్జాతీయ టెర్రరిజం, కొంచెం డివినిటీ, కాస్త మెడికల్ సైన్స్, ఇంకాస్త యాక్షన్ కలగలిపి వండిన ఈ కిచిడీ ఏ రుచీ సరిగ్గా అందివ్వలేకపోయింది.

కథలో మెయిన్ ట్విస్ట్, కొన్ని సన్నివేశాలు బాగానే ఉన్నా ఓవరాల్ గా అవసరంలేని అసహ్యమైన కామెడీ ట్రాకుతోటి, బలహీనమైన క్లైమాక్స్ తోటి, ఎమోషనల్ గా ఎక్కడా ఎలివేషన్ లేని సన్నివేశాలతోటి చతికిలబడింది.

కథ బార్డర్ దాటి చైనా, పాకిస్తాన్ ల నుంచి మొదలవుతుంది. అంత పెద్ద కాన్వాస్ పెట్టుకున్నప్పుడు క్లైమాక్స్ దానికి తగ్గట్టు ఉండాలి. అత్యంత రొటీన్ రొట్టకొట్టుడు పద్ధతిలో ముగిసిన క్లైమాక్స్, సినిమాని నిర్వీర్యం చేసిందనే చెప్పాలి. హాల్లో ఉన్న కొద్ది మంది ప్రేక్షకులు క్లైమాక్స్ ఫైట్ నడుస్తుండగానే ఎగ్జిట్ డోర్ వైపుకి నడిచారంటే అర్ధం చేసుకోవచ్చు, ఆ కథనం వాళ్ల ఆసక్తిని ఎలా చంపేసిందో.

హనుమాన్, కార్తికేయ టైపులో డివోషనల్ యాక్షన్ సినిమా అందివ్వాలన్న ఆలోచన మంచిదే కానీ, దానికి తగిన కసరత్తు జరిగినట్టు లేదు, జాగ్రత్త తీసుకోలేదు. “శివం భజే” అని టైటిల్ పెట్టుకున్నారు కనుక శివుడైనా కాపడతాడేమో చూడాలి.

బాటం లైన్: శివుడే కాపాడాలి

27 Replies to “Shivam Bhaje Review: మూవీ రివ్యూ: శివం భజే”

  1. 1995 లొ Sr. NTR కి వెన్నుపోటు…C.M కుర్చి కొటెచిండు 

    1999 BJP పుణ్యం ( కార్గిల్ యుద్ధం)

    2014 Modi/P kalyan దయ 

    2024 Modi/P kalyan దయ

    ఇంత మంది జాకీ వేస్తేకాని అక్కడ లేవదు

    జనం మెచ్చినా లీడర్ జగన్. వెన్నుపోటు తో గెలిచినా లీడర్ కాదు

    1. 40 % మెచ్చిన అని రాసుకో .. మిగిలిన వొళ్ళు దింపేశారు .. లేదు మా 40 % మాత్రమే జనాలు అంటావా .. .. సినిమాను అభిమానులు మాత్రమే చూస్తే హిట్ అవదు ..అర్ధం అయింది అనుకుంట ..

  2. ఇక్కడ కొంతమంది కులపిచ్చితో జగ్గుని సపోర్ట్ చేయటం చూస్తుంటే అసహ్యం వేస్తుంది…జనం మెచ్చిన లీడర్ జగన్ అంట…ముందు ఇంట్లో ఉన్న తల్లి, చెల్లెల్లే థూ అని ఊసారు…అయినా సిగ్గురాదు…కొన్ని బతుకులు అంతే…బ్రమల్లో బతికేస్తుంటారు

    1. బొల్లి గడ్డం గాడిని ju ntr, కళ్యాణరామ్, లక్ష్మి పార్వతి తూ అని ఊయటం లేదా

      నీ ముసలోడిని ముందు అమ్మ ఓడి, ఫ్రీ బస్సు, ఆడవాళ్లకు 15 వేలు, మూడు సిలిండర్లు ఇచ్చి మీసం తిప్పమను. నీకు 15వేలు, నీకు 15వేలు, నీకు 15వేలు, బొచ్చు పికి ఇవ్వాల

      1. హెల్లో మస్టారు నీకు విషయం అర్దం కావట్లేదు…నువ్ చెప్పిన జూ.NTR, కళ్యాణ్ రాం, లచ్చిపార్వతి వీల్లు ఎవరు సొంత రక్తసంబందీకులు కారు…ఆవేశం లో నీకు అర్దం కావట్లేదో…ఎప్పటిలా అబద్దాలతో మబ్యపెడదాం అనుకుంటున్నరో… జూ.NTR, కళ్యాణ్ రాం ఇద్దరు ఇంతవరకు బహిరంగంగా CBN ని ఒక్క మాట అన్లేదు…పైగా గెలిచాక కంగ్రాట్యులేషన్స్ చెప్పారు…మీరు మాత్రం అబద్దాల బ్రమల్లో బతికేయండి

  3. 1995 లొ Sr. NTR కి వెన్నుపోటు…C.M కుర్చి కొటెచిండు 

    1999 BJP పుణ్యం ( కార్గిల్ యుద్ధం)

    2014 Modi/P kalyan దయ 

    2024 Modi/P kalyan దయ

    ఇంత మంది జాకీ వేస్తేకాని అక్కడ లేవదు

    జనం మెచ్చినా లీడర్ జగన్. వెన్నుపోటు తో గెలిచినా లీడర్ కాదు

  4. దాదాపు 20 లక్ష మంది కి పెన్షన్లు తగ్గిం చి TDP ప్రభుత్వం. 

    జులై కం టే ఆగష్టులో 19,79, 086 పెన్షన్లు తగ్గిం చి ప్రభుత్వం. 

    ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షనర్లను టార్గెట్ చేసిం ది. గతం కం టే ఎక్కు వ పెన్షన్ ఇస్తామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు వారి సం ఖ్య ను తగ్గిస్తూ వస్తోం ది. 

    గత నెల కం టే ఈనెల భారీగా పెన్షన్లు తగిపోయాయి. కాగా, జులైలో 65 లక్షల 18 వేల 496 మం దికి పెన్షన్లు పం పిణీ చేశారు. ఈ నెలకొచ్చే సరికి 45 లక్షల 39 వేల 41 మం దికి తగ్గిపోయిం ది.

  5. దాదాపు 20 లక్ష మంది కి పెన్షన్లు తగ్గిం చి TDP ప్రభుత్వం. 

    జులై కం టే ఆగష్టులో 19,79, 086 పెన్షన్లు తగ్గిం చి ప్రభుత్వం. 

  6. దాదాపు 20 లక్ష మంది కి పెన్షన్లు తగ్గిం చి TDP ప్రభుత్వం. 

    ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షనర్లను టార్గెట్ చేసిం ది. గతం కం టే ఎక్కు వ పెన్షన్ ఇస్తామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు వారి సం ఖ్య ను తగ్గిస్తూ వస్తోం ది. 

    గత నెల కం టే ఈనెల భారీగా పెన్షన్లు తగిపోయాయి. కాగా, జులైలో 65 లక్షల 18 వేల 496 మం దికి పెన్షన్లు పం పిణీ చేశారు. ఈ నెలకొచ్చే సరికి 45 లక్షల 39 వేల 41 మం దికి తగ్గిపోయిం ది.

  7. జగన్ పెన్షన్ల కి VS బాబు పెన్షన్ల కి తేడా. 

    పిం ఛన్లకోతకు మార్గం చూపుతున్న ఈనాడు

  8. అదేంటి? తెలుగు ప్రేక్షకులు అందరూ “అశ్విన్ బాబు” ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టేస్తాడు, కల్కి ఇన్ని రోజుల్లో సాధించిన రికార్డులన్నీ ఈ ఒక్క రోజే తుడిచి పెట్టుకుపోతాయి అని ఎదురు చూస్తుంటే వాళ్ళ ఆశల మీద ఇలా నీళ్లు చల్లేసావు???

  9. ” ఒక సన్ని న్ని వే శమై తే చా లా జు గు ప్సా ప్సా కరం రం గా ఉం ఉం ది . హీ రో కి దగ్గ గ్గరుం రుం డి మూ త్ర వి సర్జ నం నం చే యిం యిం చే సీ న్ అది . అసహ్యా హ్యా ని కి పరా కా ష్ట ష్టలా ఉం ఉం ది . మూ త్రా న్ని న్ని పవి త్ర మై న “పా తా ళగం గం గ”తో పో ల్చ ల్చ డం డం ది గజా రు డు తనా ని కి ని దర్శ నం” no surprise for this. Director name is Afsar.

Comments are closed.