ఎన్టీఆర్ కు సంక్రాంతి కలిసొస్తుందా..?

41 ఏళ్ల ఎన్టీఆర్ దేవర-1తో కలిపి ఇప్పటివరకు 30 సినిమాలు చేశాడు. ఈ 30 సినిమాల్లో సంక్రాంతికి వచ్చిన మూవీస్ కేవలం 5. వీటిలో సక్సెస్ అయినవి 2 మాత్రమే. మళ్లీ ఇన్నేళ్లకు సంక్రాంతి…

41 ఏళ్ల ఎన్టీఆర్ దేవర-1తో కలిపి ఇప్పటివరకు 30 సినిమాలు చేశాడు. ఈ 30 సినిమాల్లో సంక్రాంతికి వచ్చిన మూవీస్ కేవలం 5. వీటిలో సక్సెస్ అయినవి 2 మాత్రమే. మళ్లీ ఇన్నేళ్లకు సంక్రాంతి బరిలో నిలిచాడు తారక్.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు ఎన్టీఆర్. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రాబోతోంది. దీంతో ఎన్టీఆర్ సంక్రాంతి సెంటిమెంట్ పై కొత్త చర్చ మొదలైంది.

ఎన్టీఆర్ ఫిల్మోగ్రఫీలో కాస్త వెనక్కి వెళ్తే.. నా అల్లుడు, ఆంధ్రావాలా, నాగ, అదుర్స్, నాన్నకు ప్రేమతో సినిమాలు జనవరి నెలల్లో విడుదలయ్యాయి. వీటిలో అదుర్స్, నాన్నకు ప్రేమతో సినిమాలు హిట్టయ్యాయి.

ఒక దశలో ప్రతి ఏటా సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్ చేసేవాడు ఎన్టీఆర్. 2003, 2004, 2005లో వరుసగా ఎన్టీఆర్ సినిమాలొచ్చాయి. నా అల్లుడు మూవీ తర్వాత సంక్రాంతికి రావడం తగ్గించేశాడు, మళ్లీ ఐదేళ్లకు అదుర్స్ తో సంక్రాంతి బరిలో నిలిచాడు.

అదుర్స్ తర్వాత మళ్లీ ఆరేళ్లకు సంక్రాంతికొచ్చాడు. ఎన్టీఆర్ చివరి సంక్రాంతి సినిమా ‘నాన్నకు ప్రేమతో’. ఆ మూవీ వచ్చిన పదేళ్ల తర్వాత మరోసారి సంక్రాంతి బరిలో నిలుస్తున్నాడు ఈ స్టార్ హీరో. 2026లో ప్రశాంత్ నీల్ సినిమాను రిలీజ్ చేయబోతున్నాడు.

7 Replies to “ఎన్టీఆర్ కు సంక్రాంతి కలిసొస్తుందా..?”

Comments are closed.