దొర‌క‌డంతో దొంగ‌ల‌య్యారు.. లేక‌పోతే!

అక్ర‌మాల‌కు అడ్డుక‌ట్ట వేయాల్సిన పోలీసులే, వాటికి వంత పాడితే స‌మాజం ఏమ‌వుతుందో చెప్పాల్సిన ప‌నిలేదు. వైసీపీ ప్ర‌భుత్వంలో అక్ర‌మాలు విచ్చ‌ల‌విడిగా సాగాయ‌ని ఇప్ప‌టికీ కూట‌మి నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. పోనీ, కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత…

అక్ర‌మాల‌కు అడ్డుక‌ట్ట వేయాల్సిన పోలీసులే, వాటికి వంత పాడితే స‌మాజం ఏమ‌వుతుందో చెప్పాల్సిన ప‌నిలేదు. వైసీపీ ప్ర‌భుత్వంలో అక్ర‌మాలు విచ్చ‌ల‌విడిగా సాగాయ‌ని ఇప్ప‌టికీ కూట‌మి నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. పోనీ, కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత ఏమైనా అక్ర‌మాలకు అడ్డుక‌ట్ట ప‌డిందా? అంటే… అబ్బే అలాంటిదేమీ లేద‌నే స‌మాధానం వ‌స్తోంది.

ఈ ప్ర‌భుత్వంలో దొరికితే దొంగ‌లు, లేదంటే దొర‌లు అనే రీతిలో వ్య‌వ‌హారం సాగుతోంది. తాజాగా తిరుప‌తి జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో గ్రావెల్ అక్ర‌మ ర‌వాణా య‌థేచ్ఛ‌గా సాగుతుంటే, పోలీస్ ర‌క్ష‌క్ వాహ‌నం వెన్నంటి వుంటూ, ఎవ‌రూ అడ్డుకోకుండా కాప‌లా కాయ‌డం స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. ఇంత దుర్మార్గ‌మా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. అయితే సోష‌ల్ మీడియాలో గ్రావెల్ అక్ర‌మ ర‌వాణాపై విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో తిరుప‌తి ఎస్పీ చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించ‌డం గ‌మ‌నార్హం.

చంద్ర‌గిరి మండ‌లం మ‌ల్ల‌య్య‌ప‌ల్లి గ్రామ ప‌రిధిలో రాత్రివేళ గ్రావెల్‌ను అక్ర‌మంగా త‌వ్వి టిప్ప‌ర్ల‌తో య‌థేచ్ఛ‌గా ర‌వాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్ర‌మార్కుల‌కు అధికారం అండ‌గా నిలిచింది. ఈ నేప‌థ్యంలో తొమ్మిది టిప్ప‌ర్ల‌తో గ్రావెల్ త‌ర‌లిస్తుండ‌గా, వాటి ముందు ర‌క్ష‌క్ మొబైల్ టీమ్ పైలెట్‌గా వెళ్ల‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. కూట‌మి ప్ర‌భుత్వంలో ఇంత దుర్మార్గ‌మా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

ఈ వ్య‌వ‌హారంపై ర‌క్ష‌క్ మొబైల్ హెడ్ కానిస్టేబుల్ ఎస్‌. బ‌స‌వ‌య్య‌, హోంగార్డు సుధాక‌ర్‌ను తిరుప‌తి ఎస్పీ సుబ్బ‌రాయుడు స‌స్పెండ్ చేశారు. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన సీఐ రామ‌య్య‌కు చార్జ్ మెమో ఇచ్చారు. అయితే సోష‌ల్ మీడియాలో ప‌ట్టుబ‌డ‌డంతో చ‌ర్య‌లు తీసుకున్నార‌ని, ఇలా దొర‌క‌ని దొంగ‌లు ఎంత మందో అని సామాన్య ప్ర‌జానీకం అంటున్నారు.

15 Replies to “దొర‌క‌డంతో దొంగ‌ల‌య్యారు.. లేక‌పోతే!”

  1. అందుకే కామోసు 1౦౦ కి డయల్ చేసి గంట అయినా “రక్షక్” జాడ కనబడదు సామాన్యులకు.

    1. ఇది గత ప్రభుత్వంలో జరిగితే పిర్యాదు చేసిన వాడిని కుమ్మేసి scst కేసు హత్య యత్నం కేసు పెట్టి వాడి జీవితం సంకనాకి పోయేలాగా చేసేవారు ఇప్పుడు కనీసం కొన్ని చర్యలన్న తీసుకొన్నారని మీరే రాసేరు

  2. Shame on current kootami government that they were forced to take an action because they were caught by social media. What a gross violation of law and order in the state.

  3. ఇది గత ప్రభుత్వంలో జరిగితే పిర్యాదు చేసిన వాడిని కుమ్మేసి scst కేసు హత్య యత్నం కేసు పెట్టి వాడి జీవితం సంకనాకి పోయేలాగా చేసేవారు ఇప్పుడు కనీసం కొన్ని చర్యలన్న తీసుకొన్నారని మీరే రాసేరు

  4. ఇది గత ప్రభుత్వంలో జరిగితే పిర్యాదు చేసిన వాడిని కుమ్మేసి scst కేసు హత్య యత్నం కేసు పెట్టి వాడి జీవితం సంకనాకి పోయేలాగా చేసేవారు ఇప్పుడు కనీసం కొన్ని చర్యలన్న తీసుకొన్నారని మీరే రాసేరు

Comments are closed.