పూరి ఇక తప్పుకోవాల్సిందేనా?

దర్శకుడు పూరి జగన్నాధ్ సినీ దర్శక ప్రయాణం ఇక ముగిసే దిశగా వెళ్తోందా?

బద్రి నుంచి మొదలు పెట్టిన ప్రయాణం.. డబుల్ ఇస్మార్ట్ తో పూర్తవుతోందా? దర్శకుడు పూరి జగన్నాధ్ సినీ దర్శక ప్రయాణం ఇక ముగిసే దిశగా వెళ్తోందా? ఎన్నో సినిమాలు ఫ్లాప్ అయినా ఇస్మార్ట్ శంకర్ తో బౌన్స్ బ్యాక్ అయ్యారు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ తరువాత మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారు అని పూరి ఫ్యాన్స్ అనొచ్చు. పూరి కూడా అలాంటి భావనతోనే వుండి వుండొచ్చు. కానీ ఇస్మార్ట్ శంకర్, డబుల్ ఇస్మార్ట్, లైగర్ చూసిన తరువాత అలాంటి బౌన్స్ బ్యాక్ అవకాశం వుంటుందా? అన్నదే అనుమానం.

ఇస్మార్ట్ శంకర్ ముందు అన్నీ ఫ్లాపులే. దాదాపు ఇన్నింగ్స్ ముగిసిపోయింది అనుకున్నారంతా. రామ్ ఎనర్ఙీ డ్యాన్స్ లు, మంచి కిక్ ఇచ్చే పాటలు, పక్కా స్కోరీ ఇవన్నీ కలిసి వచ్చాయి. ఇస్మార్ట్ పెద్ద హిట్ అయింది. కానీ లైగర్, డబుల్ ఇస్మార్ట్ మళ్లీ తన్నేసాయి.

డబుల్ ఇస్మార్ట్ పాటలు ఇంత సూపర్ అంత సూపర్ అనుకోవడమే తప్ప నిజానికి ఇస్మార్ట్ శంకర్ తో పోల్చుకుంటే నథింగ్ అనుకోవాల్సిందే. సరైన హీరోయిన్ పాత్ర లేదు. హీరోయిన్ సెట్ కాలేదు. నిజానికి మణిశర్మ కూడా ఇస్మార్ట్ శంకర్ కు ముందు అల్మోస్ట్ ఇన్నింగ్స్ అయిపోయినట్లే. ఇస్మార్ట్ సినిమాతో మణిశర్మ చకచకా సెకెండ్ ఇన్నింగ్స్ బోలెడు సినిమాలు చేసారు. కానీ మ్యూజికల్ హిట్ అని చెప్పుకునే సినిమా ఒక్కటి లేదు. ఒక్కటి, రెండు పాటలు తప్ప మరే పాట చెప్పుకోవడానికి కూడా లేదు. డబుల్ ఇస్మార్ట్ మరోసారి మణిశర్మ పూర్ వర్క్ ను గుర్తు చేసింది.

ఇప్పుడు పూరి విషయానికి వస్తే ఏ హీరో డేట్ లు ఇవ్వడానికి రెడీగా వున్నారు? దాదాపు అందరు హీరోలతో చేసేసారు. మరే హీరో మిగలలేదు. చూస్తూ.. చూస్తూ ఎవరూ ఇఫ్పుడు డేట్ లు ఇవ్వకపోవచ్చు. ఎవరైనా ఇచ్చినా మళ్లీ పెట్టుబడి పెట్టేందుకు పూరి స్వంత బ్యానర్ కూడా ఫైనాన్సియల్ గా అంత బలంగా ఏమీ లేదు. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కారణంగా దాదాపు నలభై కోట్లు పొగొట్టుకున్న ప్రయిమ్ షో సంగతి తేలాల్సి వుంది. పూరి ఏమైనా వెనక్కు ఇస్తారా అన్నది తెలియదు.

అందువల్ల ఇప్పుడు పూరి మళ్లీ సినిమా తీయాలంటే మూడు సమస్యలు.

ఒకటి.. పూరి ప్రశాంతంగా ఓ పూల్ ప్రూఫ్ అది కూడా గత సినిమాల వాసనలు లేకుండా, సరైన స్క్రిప్ట్ తయారు చేసకోగలగాలి.

రెండు.. సరైన హీరో దొరకాలి.

మూడు.. ఫైనాన్స్ సపోర్ట్ కావాలి.

నిజానికి కొత్త హీరోతో మంచి ఫీల్ గుడ్ స్టోరీతో సినిమా తీస్తే సక్సెస్ కొట్టగలరు. కానీ పూరి అలాంటి కథ ఇప్పుడు తయారు చేయగలరా? ఎప్పుడూ గన్స్, గ్లామర్, ఐటమ్ సాంగ్స్, ఇలా ఫార్మాట్ కథ కాకుండా? కాస్త అనుమానమే.

19 Replies to “పూరి ఇక తప్పుకోవాల్సిందేనా?”

Comments are closed.