కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషాపై కేసు నమోదు చేసేందుకు నార్సింగ్ పోలీసులు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. తన భార్త జానీతో కలిసి ఆమె బాధితురాలైన అసిస్టెంట్ కొరియో గ్రాఫర్ అయిన యువతి ఇంటికి వెళ్లి దాడి చేసినట్టు ఫిర్యాదులో వుంది. మతం మార్చుకుని తన భర్తను పెళ్లి చేసుకోవాలని సదరు బాధితురాలిపై దాడికి పాల్పడినట్టు ఫిర్యాదులో వుంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. భర్తను నిర్దోషిగా బయటికి తెచ్చే క్రమంలో బాధితురాలి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఆయేషా ఎలక్ట్రానిక్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సినీ పెద్దల్ని కలిసి తన భర్తకు మద్దతు అడుగుతానని ఆమె చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయేషాను అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది.
బాధితురాలిపై మానసిక, శారీరక దాడి చేశారన్న ఆరోపణలతో అరెస్ట్ చేసే అవకాశం వుంది. జానీ మాస్టర్, ఆయన భార్య కలిసి బాధితురాలితో దారుణంగా వ్యవహరించినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ తన భర్త బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడినట్టు తేలితే, ఆయన్ను విడిచిపెడతానని కూడా ఆమె ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు.
జానీ వ్యవహారంలో రెండు వర్గాలుగా విడిపోయి ఆరోపణలు గుప్పిస్తున్నారు. జానీ భార్య దూకుడు స్వభావంతో వ్యవహరిస్తుండడం, ఆమెపై ఫిర్యాదుతో మొత్తం వ్యవహారం సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశమైంది.
Call boy jobs available 9989793850
Call boy works 9989793850
vc estanu 9380537747
vc available 9380537747
Jail🙏🙏🙏🙏🙏🙏🙏🙏