టీడీపీ అధికార ప్ర‌తినిధికేనా బాబు హెచ్చ‌రిక?

టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి జీవీరెడ్డికి సొంత పార్టీలోనే కొంద‌రు పొగ పెట్ట‌డం మొద‌లు పెట్టారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన జీవీరెడ్డి ….కొన్ని సంద‌ర్భాల్లో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు కూడా వెనుకాడ‌లేదు.…

టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి జీవీరెడ్డికి సొంత పార్టీలోనే కొంద‌రు పొగ పెట్ట‌డం మొద‌లు పెట్టారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన జీవీరెడ్డి ….కొన్ని సంద‌ర్భాల్లో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు కూడా వెనుకాడ‌లేదు. టీడీపీ అనుకూల చాన‌ళ్ల‌లో కూచుని జీవీరెడ్డి మోతాదుకు మించి వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. అప్పుడు టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆనందంతో చ‌ప్ప‌ట్లు కొట్టారు. శ‌భాష్ అంటూ జీవీని అభినందించారు.

కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌, జీవీరెడ్డికి పెద్ద‌పీట వేస్తార‌ని అంతా అనుకున్నారు. అయితే మొద‌టి విడ‌త‌లో 20 కార్పొరేష‌న్ల‌ను భ‌ర్తీ చేస్తే, అందులో జీవీరెడ్డికి చోటు లేదు. ఇది ఆయ‌న్ను ఎంతో బాధించింది. దీంతో త‌న ఆస్థాన మీడియా వేదిక‌గా ఆవేద‌న వెల్ల‌గ‌క్కారాయ‌న‌. మొద‌టి విడ‌త‌లో త‌మ‌కు చోటు ద‌క్క‌క‌పోతే, ఏం విలువ వుంటుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అలాగే చంద్ర‌బాబునాయుడి పీఎస్ క‌ప్ప‌ర్థి తీరుతో ముఖ్య‌మంత్రికి చెడ్డ‌పేరు వ‌స్తోంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబునాయుడి హెచ్చ‌రిక చ‌ర్చ‌నీయాంశ‌మైంది. జీవీరెడ్డిని దృష్టిలో పెట్టుకునే చంద్ర‌బాబు హెచ్చ‌రించార‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. ఇలాగైతే వేటు వేస్తామ‌ని బాబు త‌న‌దైన స్టైల్‌లో జీవీరెడ్డికి హెచ్చ‌రిక పంపార‌నే సంకేతాలు వెళ్లాయ‌ని టీడీపీ నేత‌లే చెబుతున్నారు.

“నామినేటెడ్ ప‌ద‌వులు ద‌క్క‌ని కొంద‌రు నాయ‌కులు తొంద‌ర‌ప‌డి నోరు జారుతున్నారు. ఇది మంచి ప‌ద్ధ‌తి కాదు. క్ర‌మ‌శిక్ష‌ణ‌కు ప్రాధాన్యం ఇస్తాం. ఈ విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాలి” అని బాబు అన్నారు.

టీడీపీ, చంద్ర‌బాబునాయుడి శ్రేయోభిలాషిగా తాను మాట్లాడ‌న‌ని జీవీరెడ్డి చెబుతున్నారు. కానీ చంద్ర‌బాబు మాత్రం అలా భావించ‌డం లేదు. జీవీ కామెంట్స్‌ను క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘ‌న కింద టీడీపీ అధిష్టానం భావిస్తోంది. అందుకే జీవీ కామెంట్స్‌ని అదే ప‌నిగా చంద్ర‌బాబు వ‌ద్ద‌కు మోసుకెళ్లారు. జీవీ మ‌న‌సేంటో తెలిసిన త‌ర్వాత‌, ఇక ఆయ‌నకు రానున్న రోజుల్లో ఏ మాత్రం ప్రాధాన్యం ద‌క్కుతుందో చూడాలి. రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల కంటే సొంత పార్టీ నాయ‌కుల‌తోనే ఎక్కువ న‌ష్టం వుంటుంది.

7 Replies to “టీడీపీ అధికార ప్ర‌తినిధికేనా బాబు హెచ్చ‌రిక?”

  1. జగన్ పంచడానికి సరిపడినన్ని నామినేటెడ్ పోస్ట్లు లేకపోవడం తో 56 కులాల కి కార్పొరేషన్లు స్థాపించాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ 56 కాకుండా పెద్ద కులాల కి ప్రాంతం ప్రాతిపదిక మీద ఉత్తరాంధ్ర, రాయలసీమ, దక్షిణ ఆంధ్ర, మధ్య ఆంధ్ర పేరు రెడ్డి, కమ్మ, కాపు ల లాంటి కులాల కి కార్పొరేషన్లు స్థాపిస్తే పదవుల కొరత ఉండదు.

  2. That’s why I appreciate CBN, a good jolt to reddy who pounced on jagan as sky is the limit in bombarding without hesitation, Good CBN did a great job however unfortunately jagan, immediately will take him in his party in case he comes out of TDP

Comments are closed.