ప‌దవి రాలేద‌ని ధ‌ర్నా చేయాల‌నుకున్న ప‌ట్టాభి!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌ర్కార్ 20 కార్పొరేష‌న్ల నామినేటెడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసింది. మొద‌టి విడ‌త‌లో ప‌ద‌వులు ద‌క్క‌ని నేత‌లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి, ఆయ‌న…

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌ర్కార్ 20 కార్పొరేష‌న్ల నామినేటెడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసింది. మొద‌టి విడ‌త‌లో ప‌ద‌వులు ద‌క్క‌ని నేత‌లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి, ఆయ‌న భార్య చంద‌న తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్న‌ట్టు తెలిసింది. త‌న‌కు మొద‌టి జాబితాలో నామినేటెడ్ ప‌ద‌వి ద‌క్క‌కపోవ‌డం అవ‌మానంగా భావించిన ప‌ట్టాభి అవ‌మానంతో టీడీపీ కార్యాల‌యం ఎదుట ధ‌ర్నా చేయాల‌ని ఊగిపోయార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది. ప‌ట్టాభికి ప‌ద‌వి రాలేద‌ని తెలిసి ఆయ‌న భార్య చంద‌న కూడా మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యానికి వెళ్లార‌ని స‌మాచారం.

టీడీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ప‌లుమార్లు భౌతిక‌దాడుల‌కు గురి అయ్యామ‌ని, అలాగే కేసులు పెట్టించుకుని, పోలీసుల‌తో చావు దెబ్బ‌లు తిన్నామ‌ని ప‌ట్టాభి, ఆయ‌న భార్య చంద‌న పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆగ్ర‌హంతో, ఆవేద‌న‌తో చెప్పిన‌ట్టు తెలిసింది. కేసులు ఎన్ని ఎక్కువ పెట్టించుకుంటే, అంత ప్రాధాన్యం వుంటుంద‌ని ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు లోకేశ్ చెప్పిన విష‌యాన్ని ప‌ట్టాభి దంప‌తులు గుర్తు చేసి వాపోయార‌ని తెలిసింది. ఒక ద‌శ‌లో టీడీపీ కేంద్ర కార్యాల‌యం ఎదుట ధ‌ర్నాకు సిద్ధ‌మ‌య్యార‌ని స‌మాచారం. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు వ‌ర్ల రామ‌య్య త‌దిత‌రులు వారించ‌డంతో ధ‌ర్నా నిర్ణ‌యాన్ని విర‌మించుకున్నార‌ని తెలిసింది.

ప‌ట్టాభి ఆవేద‌న‌కు కార‌ణం లేక‌పోలేదు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇంత వ‌ర‌కూ మంత్రి నారా లోకేశ్ అపాయింట్‌మెంట్‌ను ప‌ట్టాభికి ఇవ్వ‌లేద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. లోకేశ్ త‌న‌ను ప‌క్క‌న పెట్ట‌డంపై మిత్రుల వ‌ద్ద ప‌ట్టాభి విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇలాగైతే పార్టీ కోసం ప‌ని చేసిన త‌న‌లాంటి వాళ్లు ఏం కావాల‌ని ప‌ట్టాభి నిల‌దీస్తున్నారని తెలిసింది. లోకేశ్ కేవ‌లం డ‌బ్బు ఇచ్చే వాళ్ల‌కే ప్రాధాన్యం ఇస్తున్నార‌ని స‌న్నిహితుల వ‌ద్ద ఆరోప‌ణ‌లు చేస్తుండ‌డం యువ నాయ‌కుడి చెవిలో ప‌డింద‌ని స‌మాచారం.

ప‌ట్టాభి వైఖ‌రితో పార్టీకి న‌ష్టం వ‌స్తోంద‌న్న‌ది లోకేశ్ అభిప్రాయం. అందుకే ప‌ట్టాభిని లోకేశ్ దూరం పెట్టార‌ని యువ నాయ‌కుడి అనుచ‌రులు చెబుతున్నారు. ఏది ఏమైనా నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీ టీడీపీలో అసంతృప్తుల్ని బ‌య‌ట పెడుతోంది.

10 Replies to “ప‌దవి రాలేద‌ని ధ‌ర్నా చేయాల‌నుకున్న ప‌ట్టాభి!”

  1. ఇదీ చంద్రబాబు స్టైల్ పార్టీ మానేజ్మెంట్ . తన అనే వాళ్ళు ఉండరు. సన్నిహితులు ఉండరు. ఆప్తులు ఉండరు. ఆయన పక్కన నిటారైన నాయకులు మాత్రమే ఉంటారు .

Comments are closed.