ఓడిపోవడం మంచిదేనట!

“మరక మంచిదే”…అంటూ టీవీలో బట్టలను ఉతికే పౌడర్ కు సంబంధించిన యాడ్ ఒకటి వస్తూ ఉంటుంది. అంటే బట్టలు ఎంత మురికిగా ఉన్న ఆ పౌడర్ వాడితే అవి శుభ్రం అవుతాయని దాని సారాంశం.…

“మరక మంచిదే”…అంటూ టీవీలో బట్టలను ఉతికే పౌడర్ కు సంబంధించిన యాడ్ ఒకటి వస్తూ ఉంటుంది. అంటే బట్టలు ఎంత మురికిగా ఉన్న ఆ పౌడర్ వాడితే అవి శుభ్రం అవుతాయని దాని సారాంశం. ఇదే టైపులో కేసీఆర్ కుమారుడు, గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాము ఓడిపోవడం మంచిదే అన్నాడు.

ఇది ఆయన రియలైజ్ అయి అన్న మాట కాదు. ఓటమిని ఒప్పుకున్నట్లు కాదు. ఇప్పటికీ కేసీఆర్, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ పొగరు మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. ఓటమి ఎందుకు మంచిదో కేటీఆర్ భాష్యం చెప్పాడు.

గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుందన్నాడు. ఆయన చెప్పింది సులభంగానే అర్థమవుతోంది కదా. రేవంత్ రెడ్డి గాడిద, కేసీఆర్ గుర్రం అన్నమాట. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని రేవంత్ రెడ్డి నాశనం చేస్తున్నాడని అంటున్నాడు. ఆయనకు పాలన చేతకావడంలేదని అంటున్నాడు.

ఆరు గ్యారంటీలు గాలికొదిలేసి హైడ్రా పేరుతో నాటకాలాడుతున్నాడని మండిపడుతున్నాడు. పేదల బతుకులు నాశనం చేస్తున్నాడని అంటున్నాడు. వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని అంటున్నాడు. అప్పుడే మంత్రి పదవులు కూడా డిసైడ్ చేస్తున్నాడు. వరంగల్ కు చెందిన దాస్యం వినయ్ కుమార్ తమ ప్రభుత్వంలో మంత్రి అవుతాడని చెప్పాడు.

రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావాలని కేటీఆర్ బలంగా కోరుకుంటున్నాడు. గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని, ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయని, ఉప ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని చాలా నమ్మకంగా ఉన్నాడు. ఓటమి నుంచి ఉపశమనం లభిస్తుందని అనుకుంటున్నాడు.

సిగ్గు లేకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడని అన్నాడు. కానీ తాము అధికారంలో ఉన్నప్పుడు చేసింది కూడా సిగ్గులేని పనేనని మర్చిపోయాడు. తమ పార్టీ వందేళ్లు రాజకీయాలు చేయాలంటే తమిళనాడులో డీఎంకే మాదిరిగా బలంగా తయారుకావాలని అంటున్నాడు. అక్కడ పార్టీ పనితీరును స్టడీ చేయడానికి ఆల్రెడీ గులాబీ పార్టీ బృందం అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు ఆ పని మీదనే ఉంది.

5 Replies to “ఓడిపోవడం మంచిదేనట!”

  1. ఒ!రే!య్ రకుల్ రావు నీ జన్వాడ ఫార్మ్ హౌస్ లో నీ నీలి చరిత్ర సంగతి ఏంటి ? ఫోన్ tapping చేసి నాటకాల డ్రామా రావు …ముక్కోడికి పట్టిన గతే నీకు కూడా

Comments are closed.